ఎడాపెడా విమర్శలతో బైడెన్ ఉక్కిరి బిక్కిరి !

Govardhan Gande………………………………………….. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గాన్ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సరైన ముందస్తు వ్యూహం లేకుండా సైనికులను, అఫ్గాన్‌ ప్రజలను హడావుడిగా తరలించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అఫ్గాన్‌ దేశం నుంచి సైనిక ఉపసంహరణకు తాలిబన్లతో లోప భూయిష్టమైన ఒప్పందం కుదుర్చుకున్నది డొనాల్డ్‌ ట్రంపే అయినప్పటికీ … ఇపుడు అధికారంలో ఉన్నారు కాబట్టి …

నవంబర్ లో సింధు నది పుష్కరాలు !

ఈ ఏడాది నవంబర్ లో సింధు నది పుష్కరాలు జరగనున్నాయి. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. పంచాంగ కర్తలు ఈ పుష్కరాల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది మొత్తం సింధు నది పుష్కర సంవత్సరం అని పండితులు చెబుతున్నారు. మొన్నటి ఏప్రిల్ ఆరో తేదీన  బృహస్పతి …

అన్నీఉత్తుత్తి సవాళ్లేనా ?

Govardhan Gande ………………………. Is the election not for the people?…………………….. ఎన్నికలు జనం కోసం కాదా?  నాయకుల పదవుల కోసమా? తెలంగాణలో కొద్ది రోజులుగా కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న సంవాదం చూస్తుంటే ఈ ప్రశ్న తప్పక తలెత్తుంది. ఒకాయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటారు. ఇంకొకాయన ఎంపీ పదవికి రాజీనామా చేయమంటారు. …

ఎక్కడిది ఈ ఈస్టిండియా కంపెనీ ?

ఈస్టిండియా కంపెనీ ని  ‘ద కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్టిండీస్’ అన్న పేరుతో 1600లో బ్రిటిష్ పాలకులే స్థాపించారు. భారతదేశంలోకి ఈ కంపెనీ వ్యాపార నిమిత్తం వచ్చి క్రమేణా దేశాన్నే ఏలింది. అప్పట్లో క్వీన్ ఎలిజబెత్ 1 బ్రిటన్‌ రాణిగా ఉండేవారు. ఈస్టిండియా కంపెనీకి ఆసియాలో స్వేచ్ఛగా …

రాజకీయాల్లో తిట్లు సహజమేనా?

Govardhan Gande …………………………………………. రాజకీయాల్లో తిట్లు/దూషణలు,నిందలు,ఆరోపణలు మామూలే.ఒక్కోసారి అవి శృతి మించుతుంటాయి.ఎబ్బెట్టుగా ఉంటాయి. అసహ్యంగా ఉంటాయి. ఆ లక్షణాలు లేని రాజకీయాలే మచ్చుకైనా లేవు.రాజకీయాలు అలానే ఉంటాయి. దీనిపై చర్చ, ఉపన్యాసాలెందుకు? అని అనిపించవచ్చు.అలా అనిపించడం సహజం కూడా. కానీ ఇది సహజమైనది కాదు. కానీ ఇది సహజమైన అభిప్రాయమే అనే నిర్దారణకు వచ్చేసాం. కాదు …

తాలిబన్లతో పోరుకు సిద్ధమైన పంజ్ షీర్ యోధులు

తాలిబన్లతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని .. పంజ్‌షీర్‌ ప్రాంతాన్నే కాకుండా అఫ్గానిస్థాన్‌ మొత్తాన్ని తాలిబన్ల పాలన నుంచి రక్షిస్తామని  పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు తాలిబన్లతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఒకవేళ కుదిరినా వారిని కాబుల్‌ పరిపాలనలో భాగంగానే పరిగణిస్తామని అంటున్నారు. అఫ్గాన్‌ ప్రజల హక్కులు, మహిళల భద్రత, మైనారిటీల రక్షణ కోసం …

అప్పట్లో ఆఫ్ఘన్ మంత్రి .. ఇపుడు ఫుడ్ డెలివరీ మాన్

పై ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్ .. ఒకప్పుడు ఆయన ఆఫ్ఘనిస్థాన్ లో కమ్యూనికేషన్ శాఖా మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం జర్మనీలో ఫుడ్ డెలివరీ చేసే మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఓడలు బండ్లు .. బండ్లు ఓడలు అవుతాయి అన్న చందాన సాదత్  కాలం కలిసి రాక జర్మనీలో చిన్న …

చరిత్రకారుడిగా కొత్త పాత్రలో డా. దగ్గుబాటి ! (2)

Abdul Rajahussain ……………………………………………. ప్ర*చాలా గొప్ప విషయం..మీరు ప్రపంచ చరిత్ర రాస్తున్నందుకు అభినందనలు .. ఈ ప్రపంచ చరిత్ర పుస్తకం ఎలా ఉండబోతుందో చూచాయగా చెబుతారా? జ …  “నేను ముందుగా ఈ విశ్వం పుట్టినప్పుటి నుండి మొదలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కరోనా వైపరీత్యం వరకు రాద్దామనుకుంటున్నాను. విశ్వంలో …

చరిత్రకారుడిగా కొత్త పాత్రలో డా. దగ్గుబాటి ! (1)

Abdul Rajahussain ……………………… డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. ఈ పేరు తెలుగు ప్రజానీకానికి సుపరిచితం.39 సంవత్సరాల క్రితం ప్రజా జీవితంలోకి ప్రవేశించి,రెండు సంవత్సరాల క్రిందట స్వచ్ఛందంగా ప్రజా జీవితం నుండి వైదొలిగిన వ్యక్తి . ఎన్ని సార్లు పార్టీ మారినా, ఎంతకాలం ప్రజాజీవితంలో ఉన్నా ఎలాంటి విమర్శలకు తావీయని వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి. కరోనా …
error: Content is protected !!