ఆమె ఇపుడు ఏం చేస్తున్నదో ?

Sharing is Caring...

ఈ ఫొటోలో కనిపించే ఆమె ఒకప్పటి  అందాల నటి మందాకిని…  చిత్ర సీమ ను ఒక ఊపు ఊపింది. 1980 వ దశకంలో  బాలీవుడ్ లో ఈమె చాల పాపులర్ నటి. తన అందచందాలతో చిత్ర నిర్మాతలను, ప్రేక్షకులను  ఆకట్టుకుంది. మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్. చిత్ర పరిశ్రమ కొచ్చాక పేరు మార్చుకుంది.  22 సంవత్సరాల వయసులో రాజకపూర్ తీసిన రామ్ తేరి గంగా మైలీ లో నటించింది. పలుచటి చీరలో అందాలను ఆరబోసిన మందాకినికి  ఆ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. సింహాసనం , భార్గవ రాముడు వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ముంబాయి మాఫియా డాన్ దావూద్ సిఫారసులతో  చాలా సినిమాల్లో చేసింది. 

అప్పటి అగ్ర హీరోలు మిధున చక్రవర్తి ,గోవిందా, జితేంద్ర ,ఆదిత్య పంచోలి వంటి వారితో మందాకినీ నటించింది. అప్పట్లో  చాలామంది నటులు,నిర్మాతలు ఆమె పరిచయం,  స్నేహం కోసం  ఆమె చుట్టూ తిరిగే వారట.అయితే ఆమె అందరిని కాదని  డాన్ దావూద్ ఇబ్రహీం తో  ప్రేమలో పడిందని అప్పట్లో మీడియా కోడై కూసింది.  అప్పట్లో దావూద్ ఇబ్రహీం  బాలీవుడ్ ను తన కనుసైగలతో శాసించేవాడని అంటారు. చాలా  సినిమాలకు పెట్టుబడులు కూడా పెట్టారని చెబుతుంటారు. పరిశ్రమపై పట్టు ఉన్న దావూద్ మందాకినీ రహస్యంగా  పెళ్లి చేసుకున్నారని ముంబయి మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత మాఫియా వ్యవహారాలపై పోలీసులు కన్నేయడంతో దావూద్ తన మకాం దుబాయి కి మార్చాడు. 
ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మందాకినే తరచుగా దుబాయి వెళ్ళేది. ఈ విషయాలు కూడా లీక్ కావడం ..పోలీసులు హెచ్చరికలు , నిఘా ఎక్కువ కావడంతో మందాకినీ దావూద్ కి దూరమైందని అంటారు. మీడియాలో వచ్చిన కథనాలను ఏరోజు కూడా మందాకిని అంగీకరించలేదు. వాటిని పట్టించుకోలేదు. వీరిద్దరి ప్రేమ కారణంగా  ఒక అబ్బాయి పుట్టాడని బెంగళూరు మీడియాలో వార్తలు వచ్చాయి.  సీబీఐ లో పని చేసి రిటైర్ అయిన నీరజ్ కుమార్ అనే వ్యక్తి ఈ విషయం చెప్పినట్టు ప్రచారం జరిగింది. 
తర్వాత కాలంలో మందాకినీ దాదాపుగా తెరవెనుకకు వెళ్ళింది. సినిమాలకు స్వస్తి చెప్పింది.  1990 తరవాత ఆమె ఒక్కసారిగా భౌద్ధ మతగురువు  దలైలామా భక్తురాలిగా మారిపోయింది. దలైలామాను కలసి ఆయన ఆశీస్సులు పొందింది. ముంబయిలో టిబెటన్ యోగా క్లాసెస్ నిర్వహించడం మొదలెట్టింది. దలైలామా శిష్యుడైన డాక్టర్ రీంపోచ్ ఠాకూర్ ని పెళ్లి చేసుకుంది. అతగాడు కొన్నాళ్ళు సన్యాసం తీసుకుని తర్వాత మామూలు జీవితంలో కొచ్చాడు. 
ఠాకూర్ టిబెటన్ మెడిసిన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. అయన తన చిన్న తనంలో మర్ఫీ రేడియో యాడ్ లో బేబీ గా నటించాడు. 
57 ఏళ్ళ ఈ అందాల నటి ప్రస్తుతం పాత జ్ఞాపకాలను మర్చిపోయి ప్రశాంతంగా  భర్తతో కాపురం చేసుకుంటోంది. 
ముంబయి మాఫియా ఆగడాలు గురించి నిర్మాత ఏక్తా కపూర్ 2010 లో  ‘వన్స్ అపాన్ ఆ టైం ఇన్ ముంబయి’ అనే సినిమా కూడా తీసింది. ఈ సినిమాలో దావూద్ , మందాకినీ పాత్రలని కూడా పెట్టారు. 

—– KNM 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూ.వి.రత్నం September 21, 2020
error: Content is protected !!