ఆ బంగారు బావుల మిస్టరీ ఏమిటో ?

Sharing is Caring...

కాంగడా కోట ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఉన్న కోట.వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను తన గర్భంలో దాచుకున్న ఈ కోటను కొల్లగొట్టడానికి ఎందరో ప్రయత్నించారని అంటారు. కొంతమంది అందినకాడికి దోచుకెళ్లారు. అయినా పూర్తి స్థాయిలో నిధులను కొల్లగొట్టలేక పోయారు.

11వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు విఫలయత్నం చేశాడు. అతని కుమారుడు జహంగీర్ 14 నెలలపాటు యుద్ధం చేసి చివరకు కోటను గెలుచుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా సమీపంలో ఉన్న ఈ కోట ఉంది. 465 ఎకరాల విస్తీర్ణంలో, ప్రకృతి అందాల నడుమ, 11 ప్రధాన ద్వారాలతో శత్రుదుర్బేధ్యంగా దీనిని నిర్మించారు.

ఎన్నో భీకర దాడులను ఎదుర్కొని .. భూకంపాలను సైతం తట్టుకుని నిలిచిన ఈ కోట.. ఇప్పటికీ ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకుంది. కోట గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కోట లోపల
మొత్తం 21 బావుల నిండా లెక్కలేనంత సంపద ఉండేదని అంటారు .. కాలక్రమంలో కొందరు వాటిని దోచుకోగా ఇప్పటికీ 8 బంగారు బావులు ఉన్నాయని చెబుతారు.

క్రీ.శ 4వ శతాబ్దంలో కటోచ్ రాజవంశీకులు ఈ కోటను నిర్మించారు. ఇది హిమాలయ రాజ్యంలో అతిపెద్ద కోట.  భారతదేశంలో 8వ పెద్ద కోట (463 ac) గా గుర్తింపు పొందింది.  మహారాజా సుశర్మ చంద్ర సుమారు 3,500 సంవత్సరాల క్రితం కాంగడా  కోటను నిర్మించాడు.  మహాభారత యుద్ధంలో కౌరవ యువ రాజులతో ఇతగాడు యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత, అతను తన దళాలతో కాంగడా కి  వెళ్లి త్రిగర్త పగ్గాలను చేపట్టాడు. తన రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించుకోవడానికి ఈ కోటను నిర్మించారని చెబుతారు.

ఎవరైనా కోట లోపలికి అనుమతి లేకుండా ప్రవేశించాలని చూస్తే అక్కడున్న ద్వారపాలకులు నిర్దాక్షిణ్యంగా వారి తలను నరికి వేసేవారట. అందుకు కారణం కోటలోని అమూల్యమైన సంపదేనని అంటారు.అప్పట్లో కోటలోని ఆలయాలకు నిత్యం విలువైన బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు గుట్టలుగా వచ్చిచేరేవి. అప్పటి పాలకులు భారీగా బంగారాన్ని దేవతలకు సమర్పించుకునేవారు.

కొంత కాలానికి లెక్కించడానికి సాధ్యం కానంత సంపద పోగుపడింది. దీనంతటినీ కోటలో ఉన్న 21 బావుల్లో నిక్షిప్తం చేశారు. మహమ్మద్ ఘజనీ 8 బావులను, బ్రిటీషు వారు 5 బావులను దోచుకొని వెళ్లారని చెబుతారు. ఈ బంగారు బావుల సంపద కోసం కాంగ్ డా కోట ఎన్నో దాడులను ఎదుర్కొని నిలబడింది.కానీ ఇప్పటికీ ఆ మిగిలిన 8 బంగారు బావుల జాడ రహస్యంగానే మిగిలింది.

బావులు ఒక్క చోట కాకుండా కోటలోని వివిధ ప్రాంతాల్లో తవ్వించి అందులో నిధులను నిక్షిప్తం చేశారు. దీంతో మిగిలిన ఎనిమిది బావులు ఎక్కడ అన్నది మిస్టరీ గా మిగిలిపోయింది. క్రీ.శ. 470లో కాంగడా కోటపై దాడి చేసిన మొదటి రాజు శ్రేష్ట. 

1890లలో బ్రిటిష్ పాలకులు ఐదు బావులను దోచుకోగా, ఘజనీ  8 బావులను దోచుకోగలిగాడు. కోటలో ఇంకా 8 బావుల నిండా నిధులు ఉన్నాయని, వాటి ఉనికి ఎవరికి తెలియదని అంటారు.  ఏప్రిల్ 1905లో తీవ్రమైన భూకంపం కోట బలమైన పునాదులను దెబ్బతీసింది. ఆ తర్వాత బ్రిటిష్ దళాల చేతుల్లోకి పోయింది.

ప్యాలెస్ ప్రాంగణం లో  అంబికా దేవి, లక్ష్మీ నారాయణ్,లార్డ్ మహావీరుల ఆలయాలు ఉన్నాయి. కోటలో 11 ద్వారాలు,  23 బురుజులు ఉన్నాయి. హిమాచలప్రదేశ్ వెళ్ళినపుడు కోటను చూసి రావచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!