ఇండియా రష్యా ల మధ్య కొత్త జలమార్గం !!

Sharing is Caring...

Pardha Saradhi Upadrasta…………

భారత్, రష్యా Eastern Maritime Corridor (EMC) చెన్నై పోర్ట్ (ఇండియా) నుంచి వ్లాడివోస్టోక్ (రష్యా Far East) వరకు 5,647 నాటికల్ మైళ్ళ సముద్ర మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నాయి..   ఇది అందుబాటులోకి వస్తే భారత్‌ రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రత, భూభౌగోళిక వ్యూహాల్లో పెద్ద మార్పు వస్తుంది.

ప్రస్తుతం ఇండియా–రష్యా సముద్ర వాణిజ్యం కోసం సరుకు ఎక్కువగా ముంబై–సెంట్‌ పీటర్స్‌బర్గ్ మార్గం ద్వారా స్యూయెజ్ కాలువ మీదుగా వెళ్తుంది.దీని దూరం: 8,675 nautical miles ఉంటుంది. ఒక షిప్ అటు వెళ్లాలంటే 35–40 రోజులు సమయం పడుతుంది.

 Eastern Maritime Corridor అందుబాటులో కొస్తే దూరం 5,647 nautical miles మాత్రమే. 20–22 రోజులు సమయం పడుతుంది .దీనివల్ల 12–15 రోజుల సమయం తగ్గుతుంది. 20–25% వరకు రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. రష్యన్ Far East వనరులకు నేరుగా చేరుకునే అవకాశాలు సులభతరమవుతాయి.

వ్లాడివోస్టోక్ ప్రాంతం ప్రపంచంలోనే వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం.ఇక్కడ ఆయిల్ & నేచురల్ గ్యాస్,బొగ్గు,టింబర్, అరుదైన ఖనిజాలు, Rare Earth Minerals,ఇండస్ట్రియల్ ముడిసరుకు లభ్యమవుతాయి. వీటిని ఇండియా నేరుగా కొనుగోలు చేసి తక్కువ ఖర్చుతో రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇది రక్షణ పరంగా ఎందుకు కీలకం?

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రభావం పెరుగుతుంది.రష్యా Far East తో రక్షణ సహకారం, నేవల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని చైనా Belt & Road Initiative కు భారత్ ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు. Arctic shipping రూట్ కలుపుకునే భవిష్యత్ గేట్ వే అవుతుంది.

Suez Canal మీద ఆధార పడటాన్ని తగ్గిస్తుంది. స్యూయెజ్ కాలువ మీద ఆధారపడటంలో సమస్యలున్నాయి. 1. ఒక్క చిన్న ప్రమాదం సమస్త వాణిజ్యాన్ని నిలిపేస్తుంది : 2021లో ఒక పెద్ద కంటైనర్ షిప్ — Ever Given — స్యూయెజ్‌లో ఇరిగిపోయి 6 రోజులు కాలువ మూతపడింది..  అప్పట్లో ప్రపంచ వ్యాప్త షిప్పింగ్-లైన్‌లు నిలిచిపోయాయి. ఆ సమయంలో సరుకు పాడు అయింది. సరుకులు తడిసిపోయాయి. దీంతో  డెలివరీలు వాయిదా పడ్డాయి. supply chain system దెబ్బ తిన్నది.

2. ఇది ఒక “చోక్-పాయింట్ (bottleneck / choke-point)” — మార్గాల బరువు ఎక్కువగా నాలుగు-దిగువ మార్గాలపై ఉంది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో చాలా దేశాలు తమ సరుకు ఎగుమతి,దిగుమతి కోసం స్యూయెజ్, మెలాకా స్వాట్, ఇతర మార్గాల మీద ఆధారపడతాయి.

చోక్-పాయింట్‌లపై ఏ చిన్న తీవ్ర అస్థిరతనైనా పెద్ద ప్రభావం ఉంటుంది. 2024–25 మధ్య గ్లోబల్ వాతావరణ మార్పులు, భూ క్షోభలు, జియోపాలిటికల్ మార్పుల కారణంగా కూడా కాలువ వాడకంపై సంకోచాలు, అనుమానాలు పెరిగాయి. ఎవడో ఒకడు నీ నౌకను కదలనివ్వను పో అంటాడు. 

3. ప్రమాదాల, భద్రతా కారణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.. కాలువలో ఘటనలు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే — షిప్పింగ్ కంపెనీలు, బీమా సంస్థలు, రవాణా — రిస్క్ ప్రీమియం పెంచుతాయి. ఈ సమయంలో సరుకు రవాణా ఖర్చు పెరిగిపోతుంది. Delay & rerouting (కల్పితం మార్గాలైన Africa చుట్టూ వెళ్లడం) వల్ల ఇంధన + సమయ + లాజిస్టిక్స్ ఖర్చులు మళ్ళీ చాలా అవుతాయి, 

4. సరఫరా వ్యవస్థలు (Supply Chains) అస్థిరతకు గురవుతాయి..సముద్ర వాణిజ్యంపై ఆధారపడి ఉన్న దేశాలకో, కంపెనీలకో — ఒక చిన్న Accident / Blockage / రిస్క్ తో సరఫరా నిలిచిపోతుంది. అన్నింటికంటే ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది.

5. భద్రత, జియో-పాలిటికల్ రిస్క్‌లు కూడా ఉంటాయి. సమీప ప్రాంతాల్లో రాజకీయ, సైనిక అశాంతి, సముద్ర దాడులు (piracy / militant attacks) ఉంటే — కాలువ మార్గం ప్రమాదకరం గా మారుతుంది.ఒక చోక్-పాయింట్ మీద ఆధారపడటం అంటే సముదాయ మార్గాల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలి.. అందుకే — ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సముద్ర కారిడార్లు అవసరం.. దీని వల్ల భారత్–రష్యా వాణిజ్యం భారీ స్థాయిలో పెరగబోతోంది.

ప్రస్తుతం India–Russia trade ~ 65 బిలియన్ డాలర్లు గా ఉంది. ఈ కొత్త కారిడార్ పూర్తి అయితే $100–120 బిలియన్‌కి పెరుగుతుందని అంచనా.. భారత ఎగుమతులకు (pharma, IT, steel, engineering goods, food products) అవకాశాలు బాగా పెరుగుతాయి. 

Act East Policy కి బలమైన మద్దతు లభిస్తుంది. ఆగ్నేయ ఆసియా దేశాలతో ట్రేడ్ కనెక్టివిటీ పెరగడం వల్ల చెన్నై దక్షిణాసియాలో ప్రధాన నౌకాశ్రయంగా మారుతుంది. ముంబై మీద వత్తిడి కూడా తగ్గుతుంది.

 మొత్తం మీద చూస్తే చెన్నై–వ్లాడివోస్టోక్ EMC కేవలం సముద్ర మార్గం కాదు .. భారత్ భవిష్యత్ ఆర్థిక శక్తి కి ఊతమిస్తుంది. ఇది ఒక భద్రతా వ్యూహం..  జియోపాలిటికల్ ప్రభావం పెరిగే మెగా మిషన్ అనుకోవచ్చు.. 
వాణిజ్యం  వేగంగా జరుగుతుంది. ఇంధన వ్యయం తగ్గుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!