డైరీల సీజన్..భద్రం బ్రదరూ బీ కేర్ఫుల్!!

Sharing is Caring...

Paresh Turlapati ………………………………..

ఏపీలో లోకేష్ ఒక్కడే రెడ్ బుక్ రాసుకున్నాడు అనుకున్నా.. లోకేష్ రెడ్ బుక్ లో ఎర్ర ఇంకు పెన్నుతో రాసుకున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు..ఇంకా లిస్టులో సజ్జల..నానీ లు లైన్ లో ఉన్నారని టాక్.

కానీ లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్.. రఘురామ కృష్ణంరాజు లు కూడా డైరీలో పేర్లు రాసుకున్నారని కొంతమందికి ఇప్పుడు తెలిసింది. లాకప్ లో పోలీసులతో బొబ్బలు ఎక్కేలా అరిపాదాల మర్దన చేయించుకున్న రఘురామ కృష్ణంరాజు ఆ దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు..

అందుకే ఆయన కూడా డైరీలో కనిపించిన పోలీసుల పేర్లు అన్నీ రాసిపెట్టుకున్నారు..
ఇప్పటికే బాగా మర్దన చేసిన ఓ సిఐడి సిఐని సస్పెండ్ చేయించి కేసు పెట్టి జైలు కు పంపారు.. ఇప్పుడు కొంచెం పెద్ద తలకాయ అయిన సిఐడి డీఐజీ మీద ఫోకస్ పెట్టారు.

నేరం చేసి దాక్కున్న ఎంతోమంది నేరస్తులను వెతికి వేటాడి గాలించి పట్టుకున్న ఆయనే ఇప్పుడు తమ డిపార్టుమెంటు వాళ్ళకు దొరక్కుండా దాక్కోవాల్సి వచ్చింది.మొత్తానికి గత ప్రభుత్వ పెద్దల మాట విని ఫాలో అయిపోయిన చాలామంది పోలీసులకు ఈ ప్రభుత్వంలో భలే చిక్కు వచ్చి పడిందే ..

ఇక పీకే డైరీలో పేరు అచ్చేయించుకున్న పోసాని కృష్ణమురళి తీర్థ యాత్రల మాదిరి రోజుకో జైలు చుట్టూ తిరుగుతున్నారు..ఒక కేసులో కోర్టుకు హాజరు కాగానే ఇంకో కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోతున్నారు.. సేమ్ వంశీ పరిస్థితి కూడా డిటో టు డిటో ..

ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజని ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ కోరుతూ ఏసీబీ వాళ్ళు గవర్నర్ గారికి లేఖ రాసారట.. ఈ లెక్కన ఇంకా ఎన్ని పేర్లు రాసుకున్నారో? ఇప్పుడు రోజా మేము కూడా డైరీలో పేర్లు రాసుకుంటున్నాం అని వార్నింగ్ పడేసారు. 

ఏతావాతా దీనర్థం ఏంటంటే ,  ప్రభుత్వ పెద్దలు చెప్పారు కదా అని పోలీసులు ఎస్ బాస్ టైప్ లో ఫాలో అయితే ఏ దొంగలను అయితే సెల్ లో పెట్టారో అదే దొంగల పక్కన ఖైదీ నెంబర్ 150 అని బ్యాడ్జ్ తగిలించుకుని కూర్చోవాల్సి వస్తుంది… అదే విధంగా పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకులు మన వెనక జగనన్న ఉన్నాడు.. చంద్రన్న ఉన్నాడు అని నోట్లో పాన్ పరాగ్ లు వేసుకుని గొట్టాల ముందు రెచ్చిపోతే తర్వాత చచ్చే చావు వస్తుంది..

అధికారంలోకి రాగానే చంద్రన్న ఏం చెప్పాడూ… అయ్యా మాకు ఆ ప్రతీకార రాజకీయాలు పడవు.. చాట్ వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అన్నాడా? నమ్మేసారా? ఇప్పుడేం జరుగుతుంది ? అదంతే బాసు .. రాజకీయాలు అలాగే ఉంటాయి.

ఏ మాటకామాట లోకేష్ మనసులో ఏం దాచుకోకుండా మేమొస్తే ఒక్కొక్కల్లని వాయగొడతాం అని ఓపెన్ గానే చెప్పేశాడు.. అయినా మీ పిచ్చిగానీ ముఖం మీద బూతులు తిడితే చప్పట్లు కొట్టి వాటేసుకుంటారా ? కాలం ఇదివరకులా లేదు.

ప్రతోడూ డైరీలో పేర్లు రాసేసుకుంటున్నారు.. అంచేత నోటి దూల ఉన్నవాళ్ళు నాలుక దగ్గర పెట్టుకోకపోతే ఆనక జగనన్న ఏమీ చేయలేడు..చంద్రన్న ఏమీ చేయలేడు…. మైండిట్.. 
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ….  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!