Tips ను క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదే!

Sharing is Caring...

చాలామంది ఇన్వెస్టర్లు స్వల్ప కాలం లో అధిక లాభాలు  ఆర్జించాలంటే స్టాక్ మార్కెట్ లో మదుపు చేయడమే మంచి మార్గం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏదో కొన్ని కేసుల్లో   మాత్రమే అలా జరుగుతుంటుంది. ఏమి తెలియక పోయినా మార్కెట్ లో షేర్లు కొని లాభాలు పొందిన వాళ్ళు కొద్దిమందే… చేతులు కాల్చుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే కొందరు బయటికి చెప్పుకుంటారు . కొందరు చెప్పుకోరు.

నిజం చెప్పుకోవాలంటే  షేర్ల పై కొద్దో గొప్పో సంపాదించాలంటే  ఇన్వెస్టర్లు  కొంత మేరకైనా కసరత్తు చేయాలి. మార్కెట్ కి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.లేదా ఆ రంగం లో నిష్ణాతులైన వారి సలహాలు తీసుకోవాలి. అయితే ఎప్పుడైనా సొంతం గా తెలుసుకొని  షేర్లలో మదుపు చేయడం ఉత్తమం. ఇక సలహాలు తీసుకోవాలంటే  కొంత సొమ్ము ఖర్చు అవుతుంది.

దేశం లో చాలామంది షేర్ టిప్స్ ఇచ్చే వాళ్ళున్నారు. ఆలాంటి సలహా దారుల వద్ద టిప్స్ తీసుకొని షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్టర్ కి ఓపిక వుంటే  సలహా దారులు ఇచ్చే టిప్స్ కూడా సరైనవో కాదో చెక్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా మన సొమ్మును మంచి షేర్ల లో మదుపు చేసే వీలుంటుంది.

అదే సమయం లో షేర్ మార్కెట్ పై అవగాహనా కూడా కొంత మేరకు పెరుగుతుంది. ఒక్కో సారి సలహా దారులు ఇచ్చే టిప్స్ కూడా అంత లబ్ది చేకూర్చవు. ఇక ఫ్రీగా  షేర్ టిప్స్ ఇచ్చేవాళ్ళు మార్కెట్లో బోలెడు మంది ఉన్నారు. వీరు ఇచ్చే టిప్స్ ఖచ్చితంగా క్లిక్ అవుతాయని చెప్పలేం.

కొంతమంది  సలహాదారులు   x  అనే షేర్ ధర  పెరుగు తుందని టిప్  ఇస్తే అది కాస్తా తగ్గి పోవచ్చు . అలా తగ్గడానికి కారణాలు బోలెడు వుంటాయి.తాత్కాలికం గా తగ్గిన తర్వాత పెరిగే అవకాశాలు వుంటాయి.అయితే షేర్  ఫండ మెంటల్ గా బలమైనదా కాదా అనేది కీలకం . అలా లేక పోతే ఇన్వెస్టర్లు నష్ట పోవాల్సి వుంటుంది .

కొంత మంది సలహా దారులు  చెత్త షేర్లను కూడా సిఫారసు చేస్తుంటారు . ఉదాహరణకు ఓ పదేళ్ల క్రితం “వీర్ ఎనర్జీ ”  షేర్ ను కొనమని   సలహా దారులు  సూచించారు. లక్షల మంది ఆ షేర్లను కొనుగోలు చేసి నష్ట పోయారు.షేర్ ధర పెరగక పోగా పూర్తిగా పతన మైంది.

కొంత మంది స్వల్ప నష్టాలతో బయట పడగా, ఇంకొంత మంది ధర పెరుగుతుందని ఆశలు పెట్టుకొని నిండా మునిగి పోయారు.మార్కెట్ లో ఇలాంటి షేర్లు ఎన్నో వున్నాయి. అందుకే అన్ని టిప్స్ ను కూడా పూర్తిగా నమ్మడానికి  వీలు లేదు.  టిప్స్ ను క్రాస్ చెక్ చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం.

అప్పుడే  కష్టార్జితం సేఫ్ గా వుంటుంది.  ఫీజు తీసుకొని టిప్స్ ఇచ్చే సలహా దారులు  కొంత బాధ్యతతో వ్యవహరిస్తారు .  ఫ్రీ టిప్స్ అంటూ కొద్ది మంది మాత్రమే తప్పుడు సలహా లతో ఇన్వెస్టర్లను నష్టాల బాట పట్టిస్తుంటారు అలాంటి సలహా దారుల పట్ల కొంత అప్రమత్తం గా వుండాలి.    స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనే  ముందు జాగ్రత్తలు తీసుకొనాలి.  

ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>>>ఈ బ్యాంక్ షేర్లపై ఓ కన్నేయండి !   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!