Revenge Thriller…
‘అశ్మీ’ ….. లో బడ్జెట్ మూవీ.2021 నాటి సినిమా .అయిదారు పాత్రలతో నడిచే నాటకం లాంటి ఫిమేల్ ఓరియంటేడ్ సస్పెన్స్ సినిమా. కథంతా రివెంజ్ డ్రామా తో సాగుతుంది. అశ్మీ అనే అమ్మాయి కిడ్నాప్ అయి నాలుగేళ్లు ఒక గదిలో బందీగా ఉంటుంది. బంధించిన వ్యక్తి అశ్మీని రోజూ రేప్ చేసేవాడు. ఒక రోజు ఆమె తప్పించుకుని స్నేహితురాలి కారుకి అడ్డం పడుతుంది. ఈ అశ్మీని ప్రేమించే శివ దగ్గరకే చివరికి చేరుతుంది.
స్నేహితురాలి సలహా మేరకు అశ్మీ శివాలు పెళ్లి చేసుకుంటారు. అశ్మీ బందీ గా ఉన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేక పోతుంటుంది. ఇక్కడ నుంచే కథ మలుపు తిరుగుతుంది. ముగింపులో తనను బంధించింది ఎవరో తెలుస్తుంది ? అశ్మీ అపుడు ఏమి చేసిందనేది కథ. రివెంజ్ డ్రామా ను దర్శకుడు ఆసక్తికరంగానే తెరకెక్కించాడు. అయితే కథ విస్తృతి తక్కువ.
సినిమా ఫస్టాఫ్ బాగున్నప్పటికీ, సెకండాఫ్కి వచ్చేసరికి కొన్ని సన్నివేశాలు చాలా నెమ్మదిగా సాగుతాయి. వేర్వేరు సంఘటనలు .. మలుపులు ఉండవు. కథలో లోపాలు ఎక్కువ. అశ్మీ బందీ గా ఉన్న రూమ్ నుంచి ఎలా బయట పడింది ? అశ్మీ వాయిస్ .. స్మెల్ ఆధారంగా శివ బాస్ రాజేశ్ మిశ్రా ను టార్గెట్ చేయడం చిత్రంగా అనిపిస్తుంది. తర్వాత అతగాడు నిందితుడు కాదని గమనిస్తుంది. ఇలా చాలా లాజిక్ లేని సన్నివేశాలతో సినిమా నడుస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా చూస్తే సినిమా బాగానే ఉందనిపిస్తుంది.
దర్శకుడు శేష్ కార్తికేయ మొదటి సినిమా ఇది. రాసుకున్న కథను నీటుగానే తెరకెక్కించాడు. కథ పై ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే బాగుండేది. ముగింపు కూడా ప్రేక్షకుడు ఈజీగానే ఊహిస్తాడు. అశ్మీ గా రుషికారాజ్ బాగానే చేసింది. పాత్ర కవసరమైన హావభావాలను పలికించింది. అశ్మీ భర్తగా రాజా నరేంద్ర .. అతని బాస్ గా కేశవ్ దీపక్ తమ పరిధిమేరకు చేశారు.
శాండి అద్దంకి నేపథ్య సంగీతం బాగుంది.బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) థ్రిల్లర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది.
ప్రేక్షకుల్నికట్టిపడేసే సన్నివేశాలు లేకపోవడంతో ఈ రివెంజ్ డ్రామా సాగదీసినట్టు అనిపిస్తుంది. శేష్ కార్తికేయ కెమెరా బాగా హ్యాండిల్ చేసాడు. కథ రాసుకుని తనే దర్శకుడిగా మారి సినిమా తీసాడు శేష్ కార్తికేయ సినిమాటోగ్రఫీ, డార్క్ మూడ్ను క్రియేట్ చేసిన విధానం బాగుంది.
రివెంజ్ .. సస్పెన్స్ సినిమాలు తీసేటప్పుడు లాజికల్ గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తెలుగు లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ రివెంజ్ థ్రిల్లర్ ‘ సినిమా ఇపుడు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతోంది.ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

