“నేను బతికే ఉన్నా” … నిత్యానంద స్వామి

Sharing is Caring...

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్ళీ వార్తల్లో కెక్కారు. “తాను చనిపోలేదని .. బతికేఉన్నా”నని నిత్యానంద స్వామి అంటున్నారు. తాను సమాధిలోకి వెళ్లానని.. శిష్యులు కంగారు పడవద్దని ప్రకటన చేశారు.

ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్నానని చెప్పుకుంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తా కథనాలు ప్రచారంలో కొచ్చాయి. ఈ కథనాలపై  స్పందించిన నిత్యానంద  తాను బతికే ఉన్నానని.. 27 మంది డాక్టర్లు తనకు చికిత్స చేస్తున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతానికి మాట్లాడ లేకపోతున్నట్లు … మనుషులను గుర్తు పట్టలేక పోతున్నట్లు నిత్యానంద అంటున్నారు. తాను  మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారు. “నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుందని అంటున్నారు. ఇక ఫేస్ బుక్ లో ఆయన శిష్యులు ఒక పోస్ట్ కూడా పెట్టారు.

నిత్యానంద ఏడాది కొకమారు సమాధిలోకి వెళ్లడం మామూలే అని .. సమాధి నుంచి  బయటి కొచ్చాక స్వామి ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. మొదట నుంచి స్వామి కి ఇవన్నీ అలవాటే.. కొంతమంది స్వామి పై లేనిపోని రూమర్లు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.   
కాగా భారత్ లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఈ స్వామి  50 సార్లు కోర్టుకు హాజరయ్యారు.

2019 నవంబర్ లో భారత్ వదిలి పారిపోయారు. ‘కైలాస’ అనేది నిత్యానంద కలల ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాలర్ ని తీసుకొచ్చారు.

అంతటితో ఆగకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. 
అయితే నిత్యానంద  ఎక్కడ ఉంటున్నారనే విషయం ఎవరికి తెలియదు.  కైలాస అధికారిక వెబ్సైట్.. రోజూ నిత్యానందకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంటుంది.

ఫేస్ బుక్ లో ఫొటోలు వీడియోలను అప్డేట్ చేస్తుంటుంది. తాజాగా.. ఆయన ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం నిత్యానంద బతికి ఉన్నారా.. చనిపోయారా ?.. అనేది మిస్టరీ.. ఆయన ఎక్కడున్నారో ? పోలీసులు  స్పందిస్తే తప్ప తెలీదు. అసలు ఈ వార్తలు కూడా ఎంత నిజం అనేది సందేహమే.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!