అమెరికాలోని ఈ ‘ఢిల్లీ’ గురించి విన్నారా ?

Sharing is Caring...

భండారు శ్రీనివాసరావు ……………………………………………..

అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి  లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ చెబుతాడు.

మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ – పలకడం మాత్రం డెల్-హై అనే.

ఈ చిన్న పట్టణానికి ఎబెనెజర్ ఫుటే అనే వ్యక్తి  ఢిల్లీ అని నామకరణం చేసాడు. దీనికి ‘ది గ్రేట్ మొగల్’ అని మరో పేరు కూడా ఉంది. ఈ టౌన్  మార్చి  23, 1798 న మిడిల్‌టౌన్, కోర్ట్‌రైట్, వాల్టన్ అనే మూడు పట్టణాల సమ్మేళనం ద్వారా ఏర్పడింది. ఒక సమయంలో అగ్రశ్రేణి వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగపడింది. ఈ పట్టణం చుట్టూ కాట్స్కిల్ పర్వత ప్రాంతాల వాలులు .. లోయలు ఉన్నాయి. ఈ పట్టణం నాలుగు పక్కల  ప్రెస్బిటేరియన్ చర్చి, గిడియాన్ ఫ్రిస్బీ హౌస్, డెలావేర్ కౌంటీ కోర్ట్ హౌస్, సోల్జర్ స్మారక చిహ్నం ఉన్నాయి. 1870 నాటి  ఫిచ్స్ బ్రిడ్జ్ (చెక్క వంతెన) కూడా ఉంది.

ఈ పట్టణంలో అదే పేరుతో ఒక గ్రామం ఉంది, ఇది అద్భుతమైన ప్రకృతి సౌందర్యం తో పర్యాటక కేంద్రం గా మారింది. క్యాట్స్‌కిల్ పర్వతాలు, లోయల గుండా ప్రవహించే ప్రవాహాలు, పెద్ద పెద్ద వృక్షాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. 1821 వ సంవత్సరంలో ఈ గ్రామం పట్టణంలో విలీనమైంది. 

ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశం లోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క ఢిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది.

అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటె దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్, బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు అమెరికాలోని పట్టణాలకు వున్నాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!