ఈ’ సెంటిమెంట్ సెవెన్ రాజ్’ గురించి విన్నారా ?

Sharing is Caring...

Crazy Man …………………………..

పై ఫొటోలో కనిపించే వక్తి పేరు సెవెన్ రాజ్.  పక్కన ఉన్నది కుటుంబ సభ్యులు. పేరు మీరు కరెక్టుగానే చదివారు. అదే అతని పేరు. ఇదేమిటి చిత్రంగా ఉందనుకుంటున్నారు కదూ. అవును .. ఇంకొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. ఇతగాడిది కర్నాటకలోని బెంగళూరు.ఇతన్ని రెడ్ ఆండ్ వైట్ రాజ్ అని కూడా పిలుస్తారు.

సెవెన్ రాజ్ కి ఎరుపు,తెలుపు రంగుల చాలా ఇష్టం. ఇష్టం అనే కంటే మహా పిచ్చ అనుకోవచ్చు. అతను వేసుకునే బట్టలన్నీ ఎరుపు తెలుపు రంగుల్లోనే ఉంటాయి. ఇక ఇంట్లో తలుపులు .. గోడలకు వేసే రంగులు .. టాయిలెట్ గదిలో రంగులు.గాడ్జెట్స్ , ఎలక్ట్రానిక్ పరికరాలు.. కార్లు ఆలా అన్నీ ఎరుపు తెలుపు కాంబినేషన్ లోనే ఉంటాయి.  తానొక్కడే కాదు ఇంట్లో వాళ్ళను ఎరుపు, తెలుపు రంగుల కాంబినేషన్ కు అలవాటు చేసాడు.

వాళ్ళు కూడా విచిత్రం గా ఇతని మాదిరిగా ఎరువు తెలుపు రంగుల బట్టలే వేసుకుంటారు. సెవెన్ రాజ్ భార్య పుష్ప మాట్లాడుతూ “మాకు పెళ్లయి పద్దెనిమిదేళ్ల అవుతున్నది. అప్పట్లో ఈ కలర్స్ వ్యవహారం నాకు కొత్త గా .. వింతగా అనిపించేది.  తర్వాత నా భర్త క్రేజ్‌ని అర్థం చేసుకుని ఆయనకు అండగా నిలిచాను” అంటోంది. సెవెన్ రాజ్ కుమారుడు భరత్‌రాజ్‌ కూడా ఈ రంగులకు అలవాటు పడ్డాడు. అతను రెడ్ హౌస్‌ స్కూల్‌లో చేరినప్పుడు, స్కూల్ యూనిఫాం ఎరుపు ..  తెలుపు రంగుల్లో ఉండేది. అలా ఆలా అవే రంగులకు  అలవాటు పడిపోయాడు.

సెవెన్‌రాజ్ 7 వ తేదీన పుట్టాడు .అతని తండ్రి కి ఇతగాడు ఏడో సంతానం.అన్నీ కలిసేలా తండ్రి అతగాడికి సెవెన్‌రాజ్ అని పేరు పెట్టారు. వీరిది ఆధ్యాత్మిక కుటుంబం. వాళ్ళు తెలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు. సెవెన్ రాజ్ 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తండ్రి చనిపోయాడు.ఆసందర్భంగా  తెలుపు రంగుకు ఎరుపు చేర్చి తాను చనిపోయే రోజు వరకు తెలుపు ఎరుపు రంగు దుస్తులను మాత్రమే ధరిస్తానని సెవెన్ రాజ్ ప్రమాణం చేసాడు.

అదే మాట మీద ఇప్పటికి నిలబడ్డాడు. తన చుట్టూ కూడా ఎరుపు తెలుపు రంగులే కనిపించేలా  చేసుకున్నాడు.  ఇక సెవెన్ గురించి కూడా చెప్పుకోవాలి. ఏడు అంకె కూడా సెవెన్ రాజ్ కి సెంటిమెంట్. కలర్స్ కు అదనంగా ఇదొక సెంటిమెంట్ అన్న మాట. ఏడు ను అతగాడు తన అదృష్ట సంఖ్యగా భావిస్తాడు. సెవెన్ రాజ్  ఎరుపు తెలుపు సూట్‌లో ఒకటి లేదా రెండు కాదు, ఏడు బటన్లు ఉన్నాయి.

అతని కారు నంబర్  ప్లేట్‌లో కూడా 7777 నంబర్ ఉంది. మొబైల్ నంబర్ కూడా 007 తో ముగుస్తుంది. అలాగే 7 మీద ఉన్న ప్రేమతో ఏడు భాషలు కూడా నేర్చుకున్నాడు. కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మాతృభాష మలయాళంతో సహా 7 భాషలు మాట్లాడతాడు.

సెవెన్ రాజ్ దగ్గర 30 పైన టైలు, 15 కోట్లు, 30 షర్టులు, 25 ప్యాంట్లు ఎరుపు .. తెలుపు రంగుల్లో ఉన్నాయి. ప్రతిరోజూ సెవెన్ రాజ్ కొత్త బట్టలు వేసుకున్నా అవే బట్టలు  వేసుకుంటాడని అనుకుంటారు. సెవెన్ రాజ్ నివాసం ఉండే ప్రాంతంలో ఇతగాడి కుటుంబాన్ని రెడ్ అండ్ వైట్  ఫ్యామిలీ అని పిలుస్తారు.అన్నట్టు సెవెన్ రాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!