ఫాంటసీ డ్రామా కి గ్రీన్ సిగ్నల్!!

Sharing is Caring...

 

Another experiment with fantasy………………..

దాదాపు 25 ఏళ్ళ తర్వాత  మెగాస్టార్ చిరు ఫాంటసీ డ్రామా చిత్రం లో నటించబోతున్నారు. గతంలో  జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి లాంటి ఫాంటసీ సినిమాల్లో చిరంజీవి నటించారు.  వీటిలో “జగదేక వీరుడు అతిలోక సుందరి” బ్లాక్ బస్టర్ హిట్.

ఈ సినిమాను కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ప్రముఖ రచయితలు యండమూరి వీరేంద్ర నాథ్ జంధ్యాల  పకడ్బందీ గా స్క్రిప్ట్ తయారు చేశారు. 1990 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో 15 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో అదొక రికార్డు.

తర్వాత కాలంలో … చిరంజీవి తో  ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి ఓ భారీ గ్రాఫిక్ సినిమా చేయాలనీ ప్లాన్ చేశారు. చిరు కూడా ఒకే అన్నారు. కోడిరామకృష్ణను డైరెక్టర్గా తీసుకున్నారు. ఆయన వేరే కథ సూచించగా  . శ్యాంప్రసాద్ రెడ్డి దానికి ఒప్పుకోలేదు. గ్రాఫిక్ మూవీ చేయాల్సిందే అని పట్టుబట్టారట.  చిరంజీవి కూడా గ్రాఫిక్ మూవీనే చేద్దాం అనడంతో ఫాంటసీ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. సత్యానంద్ ఈ సినిమాకు మాటలు రాశారు.

అమ్మోరు సినిమాతో   హిట్ అందుకున్న ఎమ్మెస్ రెడ్డి కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఖర్చు కి వెనకాడకుండా ఈ సినిమా తీశారు. 1998 లో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం  ఆరేళ్ళ పాటు  జరిగింది. గ్రాఫిక్ వర్క్ కి టైం పట్టింది. ఎట్టకేలకు 2004 లో విడుదలైంది.

‘అంజి’ ఫాంటసీ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దర్శకుడు కోడి రామకృష్ణ సినిమా ను బాగానే తీసిన కథనం స్లో గా ఉండటంతో జనాలకు నచ్చలేదు. అంచనాలకు తగిన రీతిలో సినిమా లేకపోవడంతో  సినిమాకు  సరైన టాక్ రాలేదు. నిర్మాత కు ఆర్ధికంగా  నష్టాలు వచ్చాయి.

ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది.  ఇవే కాక రెండు కెమెరా, మేకప్ విభాగాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది.

కాగా తాజా  ఫాంటసీ సినిమాతో పక్కాగా హిట్ కొట్టాలని చిరు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టడంతో  కొత్త ప్రాజెక్టు ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   స్ట్రిప్ట్‌ తో పాటు లుక్స్‌, కాస్ట్యూమ్స్, డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే ఇలా ప్రతీ విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు.

ఫైనల్‌ స్క్రిప్ట్ విని  డైరెక్టర్  వశిష్ట కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బింబిసార సినిమా తో వశిష్ట సూపర్‌ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!