City of lakes ……………………………..
ఉదయపూర్ నగరాన్ని 1559లో మహారాణా ప్రతాప్ తండ్రి మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించారు. కాలక్రమంలో ఇది పెద్ద నగరంగా మారింది. ఎన్నో అందమైన సరస్సుల ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా దీనిని ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ అని కూడా పిలుస్తారు.
పాలరాయితో చేసిన అనేక ప్రత్యేక నిర్మాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందుకే ఈ నగరానికి ‘వైట్ సిటీ’ అని పేరు వచ్చింది. దేశ, విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ నగరంలో కూడా చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లోనే అంతర్భాగంగా దాదాపు డజను పెద్ద.. చిన్న ప్యాలెస్‌లున్నాయి. ప్రధాన ప్యాలెస్ను మ్యూజియంగా మార్చారు. ఇందులో ఎన్నోకళాఖండాలను భద్రపరిచారు. సువిశాల ప్రాంగణంలో ఉన్న ఉద్యానవనాలు ఆకర్షణీయంగా ఉంటాయి.
400 ఏళ్ల నాటి లివింగ్ మ్యూజియాన్ని చూడటానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. మెరిసే షీష్ మహల్ , అమర్ విలాస్ మధ్యలో ఉన్న అద్భుతమైన ఫౌంటెన్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇతర చారిత్రక ప్రదేశాలలో బాగోర్ కి హవేలీ, సహేలియోన్ కి బారి, జగదీష్ ఆలయం, ఎక్లింజి మందిర్ వంటివి ఎన్నో ఉన్నాయి.
ఉదయపూర్ నగరం .. చుట్టుపక్కల దాదాపు 10 సరస్సులున్నాయి. ఫతే సాగర్ సరస్సు,పిచోలా సరస్సు, ఉదయసాగర్ సరస్సు,జైసమంద్ సరస్సు,రాజసమంద్ సరస్సు,జియాన్ సాగర్, మహారాణా ప్రతాప్ మెమోరియల్ వింటేజ్ కార్ మ్యూజియం తప్పక చూడాల్సిన ప్రదేశాలు.
ఉదయపూర్ లో షాపింగ్ చేస్తే ఎన్నో వెరైటీ వస్తువులను చూడవచ్చు. సున్నితమైన, సంక్లిష్టమైన సూక్ష్మ చిత్రాలు ఇక్కడ లభిస్తాయి.పిచ్వై కళ కి చెందిన సాంప్రదాయ కళాఖండాలు దొరుకుతాయి. బంధానీ, బాటిక్ వంటి సాంప్రదాయ టై-అండ్-డై పద్ధతుల్లో తయారు చేసిన రంగురంగుల వస్త్రాలు, బట్టలు దొరుకుతాయి.
చేతితో తయారు చేసిన వివిధ రకాల ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు… అలాగే చేతితో తయారు చేసిన ఆకర్షణీయమైన తోలు పాదరక్షలు షాపుల్లో లభిస్తాయి. ఇత్తడి వస్తువులు, కుండలు, చెక్క బొమ్మలు,తోలుబొమ్మలను కూడా కొనుగోలు చేయవచ్చు.
ఉదయపూర్ లో అద్భుతమైన రాజస్థానీ వంటకాలు హోటల్స్ లో లభ్యమవుతాయి.మావా కచోరి,దాల్ బాతి చుర్మా,మలై ఘేవార్,రబ్ది మాల్పువా వంటి రుచికరమైన పదార్ధాలను టేస్ట్ చేయవచ్చు.
పర్యాటకులు తమ సమయాన్నిబట్టి ప్లాన్ చేసుకోవాలి. లోకల్ గైడ్స్ సహకారం తీసుకుంటే చారిత్రిక ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. కొని ప్రదేశాల్లో ప్రవేశ రుసుము ఉంటుంది. ఉదయపూర్ సందర్శించడానికి సెప్టెంబర్ మార్చి నెలల మధ్య అయితే అనుకూలంగా ఉంటుంది.
https://www.youtube.com/watch?v=3uuOQMb5GtA. pl. watch the vedeo