అత్త గార్లకు ఎవర్ గ్రీన్ రోల్ మోడల్ ఆమేనా ?

Sharing is Caring...

Abdul Rajahussain ……….

సూర్యకాంతం!! తెలుగు వెండితెరపై గయ్యాళి … అత్తలందరికీ రోల్ మోడల్..“సూర్యకాంతం”గయ్యాళి ‘అత్తరికం’ మీద పేటెంట్ హక్కు ఆమెదే..!! ఆమె పేరు వింటే చాలు కోడళ్ళ గుండెల్లో కోటి రైళ్ళు పరిగెత్తుతాయి.ఆంధ్రదేశం హడలెత్తే పేరు’ సూర్య కాంతం‌’…

అంతమంచి పేరును పిల్లలకు పెట్టుకోకుండా చేసిన గయ్యాళి ఆమె.నిజ జీవితంలో ఆమె గయ్యాళి ‘ కాదు..ఆకలిగొన్నవారికి కడుపునిండా అన్నం పెట్టే ” అన్నపూర్ణ.!! కోడల్ని రాచిరంపాన పెట్టే ఏ అత్తనుచూసినా,సూర్య కాంతంరా! బాబు..అనడం పరిపాటి.అంతగా సూర్యకాంతం అత్త పాత్రలో క్రౌర్యాన్నిచూపించేది.

ఒక్కోసారి సినిమా హాల్లోనే ప్రేక్షకులు సూర్యకాంతాన్నితిట్టి పోసే వారు.”రాక్షసి ముం… “అంటూ శాపనార్ధాలూ పెట్టేవారు.అత్తంటే..సూర్యకాంతమే,అనేంతగా లోకంలో స్థిర పడిపోయింది. ఇది తెరముందు.

ఇక తెరవెనుక…సూర్యకాంతం వేరు.సూర్యకాంతం భోళామనిషి. షూటింగ్ కు వచ్చేటపుడు తనతో పాటు మరోపది మందికి భోజనం పట్టుకొచ్చేవారు.సూర్యకాంతమ్మ తో షూటింగ్ అంటే,కడుపు నిండా భోజనమన్నట్టే..అందుకే సూర్యకాంతాన్ని అందరూ ఇష్టపడేవారు ప్రేమించేవారు.

తెరమీద ఆమెనటించేది.తెరముందు జీవించేది.! దటీజ్‌…సూర్యకాంతం.‌ అసమానమైన character actress. ఆమె నటించడం ఎంత గొప్పగా, సహజంగావుంటుందంటే, ఆమె నటించడం లేదని,జీవిస్తోందని ప్రేక్షకులు భావించేవారు. నిత్య జీవితంలో యధార్థమైన పరమ గయ్యాళిగానో,అత్తగానో, వదినగానో, ఆడబిడ్డగానో, అన్నట్లుంటుంది.

ఆమె స్వభావం కూడా గయ్యాళి.., శాడిస్ట్ అని నమ్మేట్లుండేది..కసి,కోపం,సాధించడం, ఓర్వలేని తనం చూపించడంలో ఆమెకు ఆమే సాటి. తెరమీద వెలసిన పరమ కఠినురాలైన అత్త పాత్రకు ప్రాణం పోసిన అద్భుతమైన నటీమణి గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు వుంది.

తనికెళ్ళ భరణి అన్నట్లు సూర్యకాంతం అనే పేరును రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా కనుమరుగు జేసిన అసమాన నటీమణి ఆమె. ఆవిడ నటనకు అల్లుళ్ళు అడ్రస్ లేకుండా పారిపోయేవాళ్ళు.. పెరుగన్నంలో మాగాయిలా… పప్పన్నంలోకి చల్ల మిరపకాయలా… లంఖణం చేస్తున్న వాళ్ళకి .. చేసుకున్నవాళ్ళకి ఉసిరికాయలా … దొంగ పీనుగులకి…. పచ్చివెలక్కాయలా ఉండేది.

ఆవిడ..హీరోయిన్ల జడ పుచ్చుకుని కొట్టేది….. హీరోల చెవి మెలిపెట్టేది…కమెడియన్ల నెత్తిన మొట్టేది… విలన్లని బండ బూతులు తిట్టేది..తెరమీద భద్రకాళిలా ఉండే ఆవిడ నిజ జీవితంలో అన్నపూర్ణ …ఎవ్వరెళ్ళినా ఎప్పుడెల్లినా..కడుపునిండా పెట్టేది.

కష్టాలొస్తే కన్నీళ్ళు తుడుస్తూ మరీ కనిపిస్తుందా! అనిపిస్తుంది ఆవిడ వేలెత్తి చూపించటానికి వీల్లేనంత నటన చేసింది..ఆవిడంత నటి … భూగోళం అంతా వెతికినా దొరకదు… ఆవిడ పేరు ఆంధ్రదేశంలో ఇంకెవళ్ళకీ  పెట్టడానికి వీల్లేకుండా చేసింది.

సూర్యకాంతమంటే..సూర్యకాంతి…ఎవర్ గ్రీన్ .. ఆమెకు సాటి,పోటీ ఎవరూ లేరు..ఇకపై కూడా రారు..రాలేరు.ఆమె అత్తలకే అత్త..శాడిస్టు అత్తల గౌరవాన్ని పదికాలాలపాటు నిలబెట్టే అత్త.!!

pl. follow link ……………….whatsapp channel

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!