కామెడీ థ్రిల్లర్ … చూడొచ్చు !!

Sharing is Caring...

వంశీ కృష్ణ …………………………………….

టైటిల్ చూడగానే అందరికి మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమా లోని  “నవ్వింది మల్లె చెండు” పాట గుర్తుకు వస్తుంది. ఆ పాట గుర్తింపుని ఏ మాత్రం తగ్గించకుండా తీసిన  థ్రిల్లర్ కామెడీ సినిమా ఈ “యురేకా సకామీకా”. అతి తక్కువ బడ్జెట్ లో పరిమిత పాత్రలతో గంటన్నర పాటు ప్రేక్షకులను కదలనీయదు. 

ఒక మంచి అంశాన్ని సినిమాగా అందించే విషయంలో ఈ చిత్ర బృందం విజయవంతం అయ్యారు అని చెప్పవచ్చు. ఇది పక్కా ott ఫిల్మ్. అలా అని అధిక మొత్తం లో బూతులు, రక్తపాతాలు నిండిన సినిమా అని కాదు. Ott ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలను సమపాళ్ళలో రంగరించి అందించిన కామెడీ థ్రిల్లర్ మూవీ.

కథ విషయానికి వస్తే …… ఒక యువ జంట తమ జల్సాల కోసం నగరంలోని ఇండ్లల్లో దొంగతనాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లగా .. ఆ ఇంట్లో ఒక సైకో జంట ఉంటుంది. వారి చేత చిక్కిన ఈ యువ దొంగ జంట ఎలా బయటపడింది అన్నది సినిమా కథ.

మొదటగా సైకో పాత్రలో నటించిన సాకేత్ సాయిరాం గురించి చెప్పుకోవాలి. సినిమా మొత్తం సాకేత్ నటన ప్రేక్షకులని అలరిస్తుంది.నవ్విస్తుంది. కొన్ని చోట్ల భయపెడుతుంది. అలాగే సాకేత్ కి జంటగా చేసిన హీరోయిన్ కూడా పాత్ర పరిధిలో చాలా బాగా నటించింది. అలాగే యువ జంటగా చేసిన వారి నటన అలరిస్తుంది.

ఇక ఈ సినిమాకి కథ,మాటలు, స్క్రీన్ ప్లే .. డైరెక్షన్ తో పాటు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన సాకేత్  అన్నింటిలోను చాలా శాతం విజయవంతం అయ్యారు. ముఖ్యంగా టైటిల్స్ లో వచ్చే పాటల ఎంపిక తో పాటు, కథ నడిపిన తీరు, కామెడీని అందిస్తూనే సస్పెన్సు తో భయపెట్టడం ప్రేక్షకులకి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. పాటలు వాటి చిత్రీకరణ కూడా బాగున్నాయి. ముఖ్యం గా క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా కుదిరింది.

ఇక నెగటివ్ విషయాలకి వస్తే ఒక సీన్ లో నాలుక కట్ చేసే సన్నివేశం లేకపోతే బాగుండేది. మొత్తంగా చూసుకుంటే OTT లో గంటన్నర పాటు ఒక మంచి కామెడీ సస్పెన్సు థ్రిల్లర్ చూడాలి.. అనుకునే వారు ఈ సినిమా హాయిగా చూడవచ్చు. సాకేత్ సాయిరాం ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా ఇండస్ట్రీ కు పరిచయమయ్యారు.

సాకేత్ మ్యూజిక్ దర్శకుడు గా చేసిన “1940 లో ఒక గ్రామం” సినిమాకు నేషనల్ అవార్డు, మ్యూజిక్ కు స్టేట్ అవార్డు వచ్చింది. తరువాత సొంతూరు, హైస్కూల్ వంటి సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ఆ అనుభవంతో దర్శకుడిగా మారారు.నిర్మాత డాలీ భట్ గతంలో  “అనుకున్నదొక్కటి అయినదొక్కటి” సినిమా నిర్మించారు.తాజాగా ఈ సినిమా సాకేత్ దర్శకత్వంలో నిర్మించారు.  
https://www.hungama.com/movie/urekaa-sakaa-mikaa/80070123/ 

Hungama ott లో  “యురేకా సకామికా”  సినిమాని VI movies app, tatasky lo free గా చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!