కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్త్పత్తి తగ్గుతుందా ?

Sharing is Caring...

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో లేదు. చాలావరకు తగ్గుముఖం పట్టింది. జూన్ జులై నెలల్లో మళ్ళీ ఫోర్త్ వేవ్  రావచ్చు అంటున్నారు. ఆ విషయం అలాఉంచితే  కరోనా సోకిన వారిపై చేసిన ఒక అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు.

ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ రీసెర్చ్‌ చేశారు. ఇందులో భాగంగా కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వారు గమనించారు.కాగా, పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమేగా  జర్నల్ ప్రచురించింది.

ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు.ఈ అధ్యయనంలో వైరస్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తేలినట్లు చెబుతున్నారు.  ఈ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది ఆరోగ్యవంతులైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్యకణాల నమూనాలను సేకరించి విశ్లేషించారు.

కరోనా బారినపడిన వారితో ఆరోగ్యవంతుల.. వీర్య కణాలను పోల్చగా.. గణనీయంగా కణాలు  తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు. కరోనా బాధితుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. కొవిడ్ కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు అంటున్నారు. కాగా అంతకుముందు పరిశోధనల్లో కింది విషయాలు తేలాయి 

కరోనా స్పెర్మ్ ఉత్పత్తి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి రెండింటినీ ప్రభావితం చేస్తుంది.  వృషణ కణజాలంపై వైరస్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అంటున్నారు. సైటోకినిన్స్/ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ స్పెర్మ్ కౌంట్స్, ఫంక్షన్ ..  మోర్ఫాలజీని ప్రభావితం చేస్తాయి.

మానసిక గాయం లేదా మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా తగ్గిన లిబిడో/ అంగస్తంభనలు .. స్పెర్మ్ సంఖ్య/పనితీరుపై చికిత్స కోసం ఉపయోగించే స్టెరాయిడ్ కూడా కీడు చేస్తుందని చెబుతున్నారు.  రక్తనాళ వ్యవస్థ .. పునరుత్పత్తి వ్యవస్థ అనుసంధానించబడి ఉంటాయి. COVID-19 శరీరం అంతటా, ముఖ్యంగా గుండె ..  చుట్టుపక్కల కండరాలలో హైపర్-ఇన్‌ఫ్లమేషన్‌ను కలిగిస్తుంది.

వైరస్ వల్ల కలిగే కొత్త లేదా అధ్వాన్నమైన వాస్కులర్ పరిస్థితి ఫలితంగా పురుషాంగానికి రక్త సరఫరా ఆగిపోతుంది. లేదా కుదించబడుతుంది.మొత్తం ఆరోగ్యం క్షీణిస్తుంది. అంగ స్థంభన  అనేది సాధారణంగా అంతర్లీన సమస్య  లక్షణం. సరైన ఆరోగ్యం లేని వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపించవచ్చు.

కోవిడ్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే  వైద్యులను సంప్రదించడం ఉత్తమం.ఈ తరహా పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా మరెన్నో జరిగి ఉండొచ్చు. వాటి ఫలితాలు కూడా వస్తేనే కానీ ఈ అంచనాలు ఎంతవరకు నిజమమౌతాయో చెప్పలేం.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!