circumambulation of Giri …………………….
శుక్ర వారం చేసే గిరిప్రదక్షిణలోనే శ్రీతైల లక్ష్మీ దీప దర్శనం పొందవచ్చు. ఓ యుగాన తమ పేరాశలకు తగినట్లు ఐశ్వర్యాన్ని అందించని శ్రీలక్ష్మీదేవిపై ఆగ్రహించిన అసురులు శ్రీలక్ష్మీదేవి నివాసముంటున్న లోకం (వైకుంఠం)పై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మీదేవి అరుణాచలం కు వచ్చి తైల దీపంలా గిరి ప్రదక్షిణ చేసి తపమాచరించింది. ఆ తైల దీపమే చాలా అందంగా మెల్లగా కదలుతూ గిరి ప్రదక్షిణ చేసిన దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
శ్రీశేషాద్రి స్వాముల ఆశ్రమం సమీపంలో కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పలు మూలికా తైలాలతో మట్టిదీపాలను వెలిగించి, వాటిని చేతపట్టుకుని అరుణాచల ఈశ్వరుడిని దర్శించటాన్నే శ్రీతైల లక్ష్మీదీప దర్శనం అని పిలుస్తారు.
ఈ దర్శనం సంసారిక మహిళలకు దైవీక శక్తులను ప్రసాదిస్తుంది. దీర్ఘ మాంగల్య బలాన్ని శ్రీలక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది. సంసారంలో శాంతి సౌభాగ్యాలు చోటుచేసుకుంటాయి.
అష్ట నేత్ర దీప దర్శనం
బ్రహ్మ తన నాలుగు శిరస్సులలోని ఎనిమిది నేత్రాలతో ఒకే సమయంలో అరుణాచల శివుడిని దర్శించి ఆనందించిన అద్భుత దర్శనం అష్ట నేత్ర దీప దర్శనం… వేరు ఏ దైవమూర్తికి ఇలాంటి దర్శన భాగ్యం కలుగలేదు.గిరి ప్రదక్షిణ మార్గంలో పృథ్వీ నందీశ్వరుడి వద్ద నుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించటమే అష్ట నేత్ర దీప దర్శనం.
స్వార్థపు తలపులు తొలగించి త్యాగగుణాలను పాదుకొలిపే దర్శనమిది. మన ఇళ్లల్లో, వ్యాపార స్థలాల్లో దోషాలకు, అష్టదిక్పాలకులకు సక్రమంగా పూజలు నిర్వహించనివారికి కలిగే దోషాలకు ప్రాయశ్చిత్తం అందించే దర్శనమిది. ఈ దర్శనం పొందినవారికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎంతగా కష్టపడినా పదోన్నతులు రాకుండా విరక్తి చెందేవారికి ఆటంకాలు తొలగించి ఉన్నత స్థితిని ప్రసాదిస్తుంది.
గిరి ప్రదక్షిణ మార్గంలో కాస్త దూరం వెళితే దుర్వాసుల సన్నిధి తర్వాత అప్పు నందీశ్వరుడిని చూడగలం. అప్పు నంది కొమ్ముల నడుమ ఈశ్వరుడిని దర్శించడమే సద్గుణ పంచదీప లింగమూర్తి దర్శనం.
మానవుడిలో కామ, క్రోధ, మద, మాత్సర్యాలు వంటి అష్ట దుర్గ్గుణాలు ఉంటాయి. వాటి నుండి విముక్తిని పొందితేనే ఆత్మజ్ఞానం పొందగలుగుతాడు. దీనికి ఈ దర్శనం దోహదపడుతుంది. IAS, IPS అధికారులు, న్యాయమూర్తులు వంటి ఉన్నతాధికారులు కార్యాలయంలోను బదలీల వల్ల కలిగే కష్టాలనుండి ఈ దర్శనం విముక్తి కలిగిస్తుంది. అన్ని అర్హతలు కలిగిన వారికి ఉన్నత పదవులను ప్రాప్తింపజేస్తుంది.
వారాలూ సక్షత్రాలూ చేసే కార్యాలను పలువురైనా చేయరు అనేది సిద్ధపురుషుల వాక్కు. ఆ మేరకు ఏ కార్యాన్నయినా మనం రాహుకాలం, యమగండం, గుళికాలం, వారశూలను పరిగణనలోకి తీసుకునే నిర్వర్తించాలి. అలా చేయకపోవడం వల్ల దైనందిక జీవనంలో పలు కష్టాలు ఎదురవుతాయి.
శుక్రవారం గిరిప్రదక్షిణ చేసేవారు తేయు నంది రెండు కొమ్ముల నడుమ మహేశ్వరుడిని దర్శించటమే శుభ దీప లింగ ముఖ దర్శనం.
వారాలను లెక్కలోకి తీసుకోకుండా చేసే కార్యాలు, ప్రయాణాలు ఓ మోస్తరు పరిహారం అందిస్తుంది ఈ దర్శనం. ఈ దర్శనపు మహిమవలన వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యాలలో శుభముహూర్తాలను పట్టించుకోనివారికి ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది.
గిరి ప్రదక్షిణ చేసేవారు ఈ దర్శనం చేయడానికి ముందుగా ‘మంగళ సూక్తం’ జపించిన తర్వాత దర్శించటం అన్ని విధాలా శ్రేయస్కరం. మంగళ సూక్తం మంత్రాలు తెలియనివారు ‘ఇంద్రాయనమః మహేంద్రాయనమః’ అంటూ ప్రార్థించాలి.
యక్ష దీప దర్శనం… గిరి ప్రదక్షిణ మార్గంలో మరికాస్త దూరం వెళితే నైఋతి లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం తదితర లింగాలను దర్శించి మొక్కిన తర్వాత వాయునందిని చూడగలం. అక్కడక్కడా పలు దర్శనాలు కలుగుతాయి. సద్గురువును ఆశ్రయించి వాటిని తెలుసుకోవాలి.
వాయు నంది నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శించటమే యక్ష దీప దర్శనం. విదేశీ ఉద్యోగాలను అందించగలిగే దర్శనమిదే! ఈ ప్రాంతంలో సాంబ్రాణి ధూపం వేసి, అగరుబత్తులను వెలిగించి అణ్ణామలై ఈశ్వరుడిని దర్శించడం మరింత శ్రేష్టకరం.
1. సిమెంట్, పైప్ వంటి కట్టడ వస్తువులకు సంబంధించిన వృత్తి, వ్యాపారాలు చేయువారికి అభివృద్ధిని కలిగిస్తుంది.2. పలు ఆటంకాల వల్ల ఇల్లు నిర్మించడానికి, ఇల్లు కొనడానికి వీలులేనివారికి గృహ సంపత్తిని ప్రాప్తింపజేస్తుంది.. 3. ఎలక్ట్రానిక్స్, విద్యుత్, ఆలయ నిర్వహణ, రెవిన్యూ, అటవీ శాఖ తదితర శాఖలలో పనిచేయువారికి శుభాలను కలిగిస్తుంది.
గిరి ప్రదక్షిణ మార్గంలో మనం శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్యుల ఆశ్రమం నుండి చూడగలిగే దర్శనానికే కారణోదక దర్శనం అని పేరు. పర్వతం ముందువైపు అంబికగాను, వెనుకవైపు మహేశ్వరుడు శివశక్తి సమ్మేళనంగా ఉండే సమైక్య దర్శనమే శుక్రవారపు గిరి ప్రదక్షిణలో లభించేదే అరుదైన కారణోదక దర్శనం.
నిరుద్యోగుల కష్టాలు తొలగి, చేస్తున్న ఉద్యోగాలలో సంతృప్తిని, వివాహ యత్నాలలో కలిగే అడ్డంకులు తొలగించి, కుటుంబ సమస్యలను తీర్చి సకల సౌభాగ్యాలను కలిగిస్తుందీ దర్శనం. జవుళి, బంగారు, వజ్రాల వ్యాపారులు, ఆదాయపు పన్నులు, వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగాలలో పనిచేస్తున్నవారికి ఉన్నతస్థితిని కలిగిస్తుంది.
క్షీరోదక శివదీప దర్శనం… శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్యుల ఆశ్రమం దాటుకు వెళితే కనిపించే అధికార నంది మండపం నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని మొక్కే దర్శనమిది. ఫల పుష్పాలు, కాయగూరలు, పాకశాస్త్ర వృత్తిలో, సంగీత, సౌందర్యాలంకరణ రంగాలలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలను ప్రాప్తింపజేసే అద్భుతమైన దర్శనమిదే!
కర్తమ ముని దీప దర్శనం… శుక్రవారంనాడు ఈశాన్య లింగం సమీపాన పొందే తిరుఅణ్ణామలై ఈశ్వరుడి దర్శనమే కర్తమ ముని దీప దర్శనం. పలు సిద్ధపురుషుల జీవ సమాధులు ఉన్న ప్రాంతం నుండి లభించే దర్శనం కనుక చాలా శక్తివంతమైన దర్శనం కూడా ఇదే! మన మనస్సుల్లో తిష్టవేసుకున్న మంచి తలంపులకు కార్యరూపమిచ్చి వాటిని నెరవేర్చగల అత్యద్భుత దర్శనం కూడా ఇదే!
చంద్ర పుష్టి దీప దర్శనం… ఇక బస్టాండు దాటిన తర్వాత శ్రీదుర్గమ్మ ఆలయం వద్ద లభించే దర్శనమే చంద్ర పుష్టి దర్శనం. పిండి వస్తువులు, ధాన్యాలు, పాత్రల వ్యాపారం చేసేవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈ ప్రాంతానికి చేరువగానే శ్రీ అంగ ప్రదక్షిణ అన్నామలై స్వాముల జీవసమాధి ఉంది. తిరుఅణ్ణామలైవాసుని అంగప్రదక్షిణం చేస్తూ సంపాదించిన సొమ్ములతో నిరాటంకంగా అన్నదాన కైంకర్యంచేసి కీర్తి గడించిన మహానుభావుడాయన.
ఆ మహాపురుషుడి సమాధి దర్శనం పాపాలను, కర్మఫలితాలను పటాపంచలు చేస్తుంది. ప్రస్తుతం ‘సేవాశ్రమం’ అని పిలువబడే ఈ స్థలాన్ని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా దర్శించి తరలించాలి!
గర్బోదక శివ దీప దర్శనం… శుక్రవారం గిరి ప్రదక్షిణకు ముక్తాయింపుగా శ్రీభూత నారాయణ పెరుమాళ్ ఆలయం నుండి లభించే తిరుఅణ్ణామలై వాసుడి దర్శనమే ‘గర్బోదక శివ దీప దర్శనం’. జీవితంలో చేసే తప్పులను మనంతటమనమే తెలుసుకొని, సరిదిద్దుకుని సుఖప్రదమైన జీవితాన్ని అందించే అరుదైన దర్శనం కూడా ఇదే. ఈ స్థలంలో నిలిచి దర్శించడం శుభదాయకం.
మనకు ఈ భూలోక జీవనం అందించిన పూర్వీకులు ప్రత్యేకించి ఆది పూర్వీకులైన 14 మనువులను స్మరించి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరించడంతో శుక్రవారంనాటి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది.