నాగ సాధువులు గా మారుతున్నడాక్టర్లు,ఇంజనీర్లు !

Sharing is Caring...

వారంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, మెరైన్ బయోలాజిక్స్, మేనేజ్ మెంట్ గ్రాడ్యూయేట్లు , ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు చదివినావారే.  వీరంతా నాగ సాధువులు గా మారుతున్నారు. కుంభ మేళా అర్ధ కుంభ మేళా సమయాల్లో యువకులు  ప్రయాగ తదితర ప్రాంతాల్లో నాగా సాధు పెద్దలను కలసి సాధువుల్లో చేరిపోతున్నారు.

ఇలా సాధువులుగా మారే వాళ్లలో హిందువులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే.ఇందులో ముస్లిం,  క్రిస్టియన్,ఇతర కమ్యూనిటీలకు చెందిన యువత కూడా ఉంటున్నారు. ఉక్రెయిన్ , మలేషియా దేశాల నుంచి కూడా వచ్చి మరీ ఇలా సాధువులుగా మారిపోతున్నారు.

సాధువుగా మారాలంటే వారి భవబంధాలు, ప్రేమానురాగాలు, బంధుత్వాలను వదిలిపెట్టాలి.అలా వచ్చిన వారినే సాధువుగా మారుస్తున్నారు. ఒకసారి సాధువుగా మారాక  వారు కామ, క్రోధ,మద, మాత్సర్యాలకు దూరంగా ఉండాల్సిందే. సన్యాసం  స్వీకరించాక వారు హిమాలయాలు , గుడులు, గోపురాల వెంటే ఉంటూ జీవితాంతం భగవంతుడి ధ్యాసలో బతకాల్సి ఉంటుంది.

దిగంబరంగా ఉండాలి .. తిరగాలి .. భిక్ష కు వెళ్ళాలి .. దొరికితే తినాలి .. లేదంటే  గాలి నే భోం చేయాలి. చలికి, ఎండకు, వానకు చలించకూడదు. అంత కష్ట పడాలి. ఇన్నికష్టాలు ఉంటాయని తెలిసినా పెద్ద సంఖ్యలో చదువుకున్న వారు.. ఉద్యోగులు సాధువులుగా మారిపోతున్న వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

ఉద్యోగం లో ఒత్తిడి , కుటుంబ సమస్యలు, ప్రేమలో పడి మోస పోవడం ,బిజీ లైఫ్లో ఇమడలేక యువకులు ఇలా సాధువులుగా మారిపోతున్నారు. యువత ఆధునిక పోకడలకు అలవాటు పడి .. అవి నెరవేర్చుకోలేక అశాంతి కి గురవుతున్నారు. వేగాన్ని అందుకోలేకపోవడం.. ఫ్యామిలీ గొడవలు భరించలేకపోతున్నారు.

గతం లో మాదిరి ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం.. ధైర్యం చెప్పే అమ్మమ్మ తాతయ్యలు లేకపోవడం.. ఎవరికీ వారే యమునా తీరే తరహా జీవితాలను  తట్టుకోలేక సన్యాసం వైపు ఆకర్షితులవుతున్నారు. ఎక్కడో పుట్టి ..మరెక్కడో పెరిగి చివరకు సాధువులుగా మారడానికి ఇండియాకు వస్తున్నారు.

ఇలా వస్తోన్న వారి వయసు 18 నుంచి 30 లోపు ఉంటోంది. వందలు , వేలల్లో వచ్చి పవిత్ర స్నానాలు చేసి .. పిండ ప్రదానాలు కావించి . వారి అంత్యక్రియలు వారే చేసుకుని సాధువుల్లో కలుస్తున్నారు. రాత్రంతా జరిగే అగ్ని పూజల్లో పాల్గొని సన్యాసం స్వీకరిస్తున్నారు.

ఎప్పుడైతే అఖిల భారతీయ అకడా పరిషత్ వారిని ఆమోదిస్తుందో.. అప్పటి నుంచి వారి జీవితం.. చాలాకఠినంగా మారుతుంది. అప్పటికే ఉన్న నాగసాధువులు కొత్తగా నాగసాధువులుగా మారిన వారిని సంవత్సరాల పాటు పరీక్షిస్తారు.

వారు నాగ సాధువులుగా ఉండ గలుగుతారా, కేవలం ఏదో జీవితంపై విసుగుతో వచ్చారా లేక ఎప్పటికీ ఉండగలుగుతారా? అని టెస్ట్ చేస్తారు. అందులో  ఉత్తీర్ణులు అయితేనే నాగసాధువులుగా కొనసాగుతారు. గతంలో కొందరు ఉండలేక తిరిగి వచ్చినవారు కూడా ఉన్నారు.  ఏదైతేనేం మొత్తం మీద సాధువుల సంఖ్య పెరుగుతోంది. 

————–K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!