ఈ కుంకుమ పువ్వు కిలో ధర ఎంతో తెలుసా ?

Sharing is Caring...
Most expensive spice

కుంకుమ పువ్వు.. అనగానే వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్. ఆంగ్లంలో ఈ కుంకుమ పువ్వును సాఫ్రాన్ అంటారు. ఇండియాలో హై క్వాలిటీ కుంకుమ పువ్వు కాశ్మీర్ లో తప్ప మరెక్కడా దొరకదు. ప్రపంచ వ్యాప్తంగా కాశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉంది.   ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి.

కొండ ప్రాంతాల్లోని పొడి నేలలో ఇది ఎక్కువగా పండుతుంది. తాజాగా కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా పాంపోర్ లో సాఫ్రాన్ సాగు రైతులకు మంచి లాభాలు అందిస్తోంది. చాలా ఏండ్ల తర్వాత వర్షాలు బాగా పడటంతో కుంకుమ పువ్వు ఉత్పత్తి పెరిగింది.  రైతు కుటుంబాలన్నీ ఇప్పుడు సాఫ్రాన్ సేకరణలో నిమగ్నమైనాయి.

కాశ్మీరీ కుంకుమ పువ్వు కిలో రూ. 3.50 లక్షల నుంచి 4లక్షల వరకు ధర పలుకుతోంది. అందుకే సాఫ్రాన్ ను బంగారంతో సమానంగా చూస్తారు. అందుకే కుంకుమ పువ్వును ‘రెడ్ గోల్డ్’గా కూడా పిలుస్తారు. గతేడాదితో పోలిస్తే ఉత్పత్తి రెండింతలు కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుంకుమపువ్వు ఇరాన్, గ్రీస్, మొరాకో, స్పెయిన్, కాశ్మీర్, ఇటలీలో వాణిజ్యపరంగా ఉత్పత్తి అవుతోంది. దీని మూలాలు ఇరాన్ లో ఉన్నాయంటారు.

కాశ్మీర్ ప్రాంతంలో  వందలాది కుటుంబాలు కుంకుమ పువ్వునే సాగు చేస్తుంటాయి. 9వేల ఎకరాల్లో పండిస్తారు. పుల్వామా జిల్లాలోని పాంపోర్ ఏరియాలో సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఆశించినదానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది.  కుంకుమ పువ్వు సేకరణలో రైతు కుటుంబాలన్నీ బిజీ గా ఉన్నాయి.

ఈ ప్రాంతమంతా రైతులు సాఫ్రాన్ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం కాశ్మీరీ కుంకుమ పువ్వుకు జియో ట్యాగింగ్ ఇచ్చింది. ఇలా చేయడంతో ప్రతీ ఒక్కరికీ కాశ్మీరీ క్వాలిటీ సాఫ్రాన్ దొరుకుతుంది. గుర్తింపు లభిస్తున్నది.  రైతులు  కూడా ఆర్థికంగా లబ్ది పొందుతున్నారు.  పాంపోర్ నుంచే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకు కుంకుమ పువ్వు ఎగుమతులు జరుగుతున్నాయి.

ఈ సాఫ్రాన్ సాగును చూసేందుకు ప్రత్యేకంగా టూరిస్టులు  పుల్వామాలోని పాంపోర్ కు వస్తుంటారు. ఈ ఏడాది సాగు  బాగుండటంతో వందలాది మంది టూరిస్టులు కుంకుమ పువ్వును చూసి వెళ్తున్నారు. సేకరణ నుంచి ప్యాకింగ్ దాకా ప్రతీ అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

మెరూన్, ఎల్లో, పర్పుల్ కలర్లో కనిపించే పువ్వులు  చూపరులను ఆకట్టుకుంటాయి. కొంతమంది టూరిస్టులు కుంకుమ పువ్వును పొలంవద్దనే కొనుగోలు చేస్తుంటారు.. దాల్ లేక్, పహల్గం, గుల్మార్టో పాటు కుంకుమ పువ్వు పొలాలు కూడా కాశ్మీర్ లోని టూరిస్ట్ స్పాట్ లో ఒకటిగా నిలుస్తున్నాయి.

ప్రభుత్వం కూడా పాంపోర్లో సాఫ్రాన్ పార్కు ఏర్పాటు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేసి ఎగుమతి చేస్తున్నది. కుంకుమ పువ్వును  ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పిల్లలు ఎర్రగా పుట్టాలని గర్భిణీ స్త్రీలకు పాలలో కలిపి ఇస్తారు. అదేవిధంగా పూజా సామగ్రి, స్వీట్లు, సెంట్లను తయారీలో  కూడా సాఫ్రాన్ ఉపయోగిస్తారు.

ఒక గ్రాము పువ్వు 269 రూపాయలు మాత్రమే. కుంకుమపువ్వును కామోద్దీపన ద్రవ్యాల్లో , డయాఫోరేటిక్ [చెమటను కలిగించడానికి], కార్మినేటివ్ [గ్యాస్‌ను నిరోధించడానికి] ,ఋతుస్రావం సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు  మానసిక బలహీనత తగ్గడానికి .. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి వాడతారు.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!