సిల్లీ కారణాలతో విడాకులకు …

Sharing is Caring...

ఈ ఆధునిక యుగం లో వివాహాలు కావడం .. విడాకులు పుచ్చుకోవడం జెట్ స్పీడ్ తో జరిగిపోతున్నాయి. సంబంధాలు చూసినంత కాలం లేదా పెళ్లి ఏర్పాట్లు కి పట్టినంత కాలం కూడా కాపురాలు సాగడం లేదు. ఏ చిన్న గొడవ వచ్చినా వెంటనే విడిపోతున్నారు. అందుకే… విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు జంటలు చూపిస్తున్న సాకులు  వింటే ఆశ్చర్యపడాల్సిందే.

కొన్ని విడాకుల కేసులను చూస్తె సిల్లీ గా ఉన్నాయనిపిస్తుంది. కొందరు చిన్న విషయాలకే విడాకులు కావాలంటూ కోర్టు కెక్కిన ఉదారణలున్నాయి.  @ బ్రెడ్‌ఫోర్క్‌ను తన భర్త పచ్చి బఠాణీలని తినడానికి వాడాడట. పచ్చి బఠాణీలను తినడానికి మామూలు ఫోర్క్‌కు బదులుగా బ్రెడ్ ఫోర్క్ వాడారని …తనకు విడాకులు కావాలని ఒక అమ్మడు కోర్టుకెక్కిందట.కువైట్‌లో ఈ భార్యాభర్తల ‘విడాకుల వివాదం’లో తన భర్తకు టేబుల్ మ్యానర్స్ లేదని, ఇలాంటి భర్తతో జీవితాంతం కలిసి ఉండటం అసాధ్యమంటూ సదరు భార్య వాపోయింది.

@ ఇంకో కేసులో మన ఇంట్లో మామూలుగా టూత్‌పేస్ట్‌ను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా బ్రష్‌పై  వేసుకుంటారు. కొందరైతే చివరి నుండి నొక్కి వేసుకుంటే బాగుంటుందని చెబుతుంటారు. అలా కాకుండా పేస్టు ట్యూబ్ మధ్యలో నొక్కి వేసుకోవడమే సదరు భర్త చేసిన తప్పు. దీనికే తమకు విడాకులు కావాలంటూ భార్య కోర్టుకెక్కింది. దీనిపై వాదిస్తూ… ఈ విషయం గురించి తాము ఎన్నోసార్లు వాదించుకున్నామని, ట్యూబు చివర నుంచి నొక్కాలని ఎన్నిసార్లు చెప్పినా వినడంలేదని భర్తపై కేకలేసిందట భార్య.

@ మరో విడాకుల కేసులో నమ్మశక్యం కాని కారణం… కేవలం తాను మంచినీళ్ళు అడిగినప్పుడు వెంటనే నీళ్లు తేలేదని కారణంగా చూపించి భర్త భార్య నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడట. మొత్తానికి కువైట్‌లో ఇలాంటి విచిత్రమైన విడాకుల కేసులు కోర్టుకు వస్తున్నాయట. @ అలాగే భర్త గురక పెడుతూ తనకు నిద్ర లేకుండా చేస్తున్నారనే  కారణం పై విడాకులు అడిగినవారు లేకపోలేదు.

@ తన భార్య వారానికి ఒకసారి కూడా స్నానం చేయడం లేదని మరో భర్త ఆమధ్య కోర్టుకెక్కారు. ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి మనదేశంలో కూడా ఇలాంటి కేసులు గుర్గావ్ కోర్టుకు వచ్చాయి. ఇలాంటి కేసులు వచ్చినపుడు కోర్టు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ దంపతులను ఇంటికి పంపుతుంది.

అదలా ఉంటే ఈ కింది కారణాల వలన దంపతుల్లో ఒకరి పట్ల మరొకరికి విరక్తి పుడుతుంది. @ చిన్నవిషయాలకే ఘర్షణ పడటం .. తీవ్రస్థాయిలోవాదించడం  @ ఒకరిపట్ల మరొకరికి నమ్మకం లేకపోవడం @ వివాహేతర సంబంధాలు @ దూరంగా మసలడం  / శారీరక సాన్నిహిత్యం లేకపోవడం@ భాగస్వాముల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం @ తరచుగా కోపం తో భాగస్వామిపై చేయి చేసుకోవడం.

@ సిగరెట్లు ..మద్యపాన వ్యసనాలు @ బయట మహిళలు /పురుషులతోసాన్నిహిత్యం @ కుటుంబ బాధ్యతలపై శ్రద్ధ చూపకపోవడం @ ఆర్థిక సమస్యలు / అప్పులు @ అవగాహన లేని వయసులో పెళ్లి @ భాగస్వాముల మధ్య ఆసక్తులు /అభిరుచులు కలవకపోవడం.

ఈ విషయాలనే ప్రస్తావిస్తూ కోర్టులకెక్కుతారు. పై వన్నీకూడా కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ ఇగో సమస్యతో దూరం అవుతారు. ఈ కాలం పెద్దలు కూడా సరైన రీతిలో జోక్యం చేసువడంలేదు. కొందరైతే ఇద్దరినీ దూరం చేసేదాకా నిద్రపోరు. మొత్తం మీద కారణాలు ఏవైనా ఒకరి పట్ల ఒకరికి ద్వేష భావం ఏర్పడిందంటే మటుకు విడాకులు అనివార్యం.విడాకులకు కేవలం ఆడవాళ్లే కారణమని , అలాగే పురుషులే మూలమని ఇతమిద్ధంగా తేల్చి చెప్పలేము.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!