స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల  నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్
ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు చాలాసార్లు జరిగింది. ఇదిలా ఉంటే రజనీ పొటీ చేస్తే గె
అంతవరకు బాగానే ఉంది. మరి మిగతా స్టేట్ విషయం ఏమిటి ? స్టేట్ మొత్తం పార్టీ పోటీ చేయదా ? ఈ అంశాలపై క్లారిటీ లేదు.
ఇక రజనీ  ముఖ్యమంత్రి పదవి కి తాను పోటీ పడనని, పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని ఆరు నెలల క్రితం ప్రకటించారు. ఈ మాటతోనే అభిమానులు సగం డీలా పడ్డారు. వేరే ఎవరినో సీఎం పీఠం పై కూర్చోపెడతా అంటే అభిమానులు హుషారుగా పార్టీ కోసం పని చేస్తారా  అనేది సందేహమే. 
రజనీ ప్రకటనను గమనిస్తే ఆయనకే అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదని … అందుకే తటపటాయిస్తున్నారని అనిపిస్తోంది.
 ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా అదే అంటున్నారు.  నిజంగా పార్టీ పెట్టి దూసుకుపోవాలనుకుంటే రజనీ మీన మేషాలు లెక్కించరని  
చిరంజీవి అట్టహాసంగా ప్రజారాజ్యం పార్టీ
 కన్నడ స్టార్ ఉపేంద్ర  పార్టీ  అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినా ఓటర్లు పట్టించుకోలేదు. నామమాత్ర ప్రభావం కూడా ఉపేంద్ర చూపలేకపోయారు. అలాగే తమిళనాట  నటుడు విజయకాంత్ పార్టీ ఏమైందో తెలిసిన  విషయమే.
ఇక నటుడు కమల్ హాసన్ పార్టీ  2019  లోక సభ ఎన్నికల్లో పోటీ చేసి పెద్ద ప్రభావం చూపలేకపోయింది. పార్టీ 36 చోట్ల పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకోలేకపోయిం
దీంతో రజనీ పార్టీ ఏర్పాటు విషయమై తర్జన భర్జన పడుతున్నారని సమాచారం.  ఒక వైపు అభిమానుల ఒత్తిడి … మరో వైపు భయపెడుతున్న వాస్తవ పరిస్థితుల మధ్య రజనీ ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారని అంటున్నారు. ధైర్యం చేసి నిర్ణయం తీసుకుంటే మటుకు సన్నిహితుడైన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని  ముందుంచి పార్టీని నడపాలని రజనీ  భావిస్తున్నట్టు  సమాచారం. 
ఇక తమిళనాట పొలిటికల్ వాక్యూమ్ ఉన్నప్పటికీ రజనీ దానిని ఉపయోగించుకుని  రాజకీయాలలో దూసుకుపోగలరా ? అనేది కూడా సందేహమే. డీఎంకే బలమైన పార్టీ అందులో సందేహం లేదు. స్టాలిన్ అనుభవం ఉన్న రాజకీయ వేత్త. అన్నాడీఎంకే పై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ తక్కువగా అంచనా వేయలేం.  ముక్కోణపు పోటీ లో సత్తా చాటుకోవాలి. ముఖ్యంగా పొలిటికల్ లీడర్ కి కావాల్సిన డైనమిక్ లక్షణాలు రజనీకి లేవని ఆయన వ్యతిరేకుల అభిప్రాయం. అలాగే రజని నాన్ లోకల్ అన్న ప్రచారం చాపకింద నీరులా సాగుతోంది.  రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 
				 
				

 
										 
										 
										
ఎవరు యేపని చేయాలో, ఆ పని వాళ్లే చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు లెక్క !😀