She went behind the curtain like that……………………
ఫొటోలో కనిపించే నటి ఒకప్పటి అందాల తార మందాకిని.1980 వ దశకంలో బాలీవుడ్ లో ఈమె చాల పాపులర్ నటి. తన అందచందాలతో చిత్ర నిర్మాతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్.చిత్ర పరిశ్రమ కొచ్చాక నటుడు రాజకపూర్ ఆమెకు ఆపేరు పెట్టాడు.
22 సంవత్సరాల వయసులో రాజకపూర్ తీసిన ‘రామ్ తేరి గంగా మైలీ’ లో నటించింది. పలుచటి చీరలో అందాలను ఆరబోసిన మందాకినికి ఆసినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయి భారీ గా వసూళ్లను రాబట్టింది.దీంతో మందాకినీ కి డిమాండ్ పెరిగింది. సింహాసనం , భార్గవ రాముడు వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించింది.
ఒక ఫంక్షన్ లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తో పరిచయం అయింది. అది క్రమేణాస్నేహంగా మారింది. అప్పట్లో చాలామంది నటులు,నిర్మాతలు మందాకినీ పరిచయం,స్నేహం కోసం ఆమె చుట్టూ తిరిగే వారట.అయితే ఆమె అందరిని కాదని డాన్ దావూద్ ఇబ్రహీంతో ప్రేమలో పడిందని అప్పట్లో మీడియా కోడై కూసింది.
దావూద్ సిఫారసులతో చాలా సినిమాల్లో చేసిందని అంటారు. అప్పట్లో దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ ను తన కనుసైగలతో శాసించేవాడని అంటారు.చాలా సినిమాలకు పెట్టుబడులు కూడా పెట్టారని చెబుతుంటారు.పరిశ్రమపై పట్టు ఉన్న దావూద్ మందాకినీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ముంబయి మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి.
అప్పటి అగ్ర హీరోలు మిధున చక్రవర్తి ,గోవిందా, జితేంద్ర ,ఆదిత్య పంచోలి వంటి వారితో మందాకిని పలు సినిమాల్లో నటించింది. 1994లో డాన్ దావూద్ ఇబ్రహీంతో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న మందాకిని ఫోటోలు మీడియాలో వచ్చాయి. ఇది ఆమె కెరీర్‌ను దెబ్బతీసింది.
మందాకిని ఫోటోలు మీడియా లో రావడానికి ఒక సంవత్సరం ముందు, మార్చి 12, 1993న, 12 బాంబు పేలుళ్లలో 257 మంది మరణించారు. 1,400 మంది గాయపడ్డారు.ఈ వరుసపేలుళ్ల వెనుక దావూద్ ఇబ్రహీం ఉన్నారు.ఈ క్రమంలోనే అతడు మకాం దుబాయికి మార్చాడు.
అప్పటినుంచి పోలీసులహెచ్చరికలు,నిఘా ఎక్కువ కావడంతో మందాకినీ దావూద్ కి దూరమైందని అంటారు. మీడియాలో వచ్చిన కథనాలను ఏరోజు కూడా మందాకిని అంగీకరించలేదు. వాటిని పట్టించుకోలేదు. అక్కడనుంచి సినిమా ఛాన్సులు కూడా తగ్గాయి. మంచి ఊపు మీద ఉన్నటైములో మందాకిని వ్యక్తిగత జీవితం వివాదాల పాలైంది.
వీరిద్దరి ప్రేమ కారణంగా ఒక అబ్బాయి పుట్టాడని బెంగళూరు మీడియాలో వార్తలు వచ్చాయి. సీబీఐ లో పని చేసి రిటైర్ అయిన నీరజ్ అనే వ్యక్తి ఈ విషయం చెప్పినట్టు ప్రచారం జరిగింది. 1996లో జోర్దార్ చిత్రంలో మందాకిని నటించారు. అదే ఆఖరి సినిమా. తర్వాత ప్రయత్నించింది. కానీ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత కాలంలో మందాకినీ దాదాపుగా తెరవెనుకకు వెళ్ళింది. సినిమాలకు స్వస్తి చెప్పింది.
ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె ఒక్కసారిగా భౌద్ధ మతగురువు దలైలామా భక్తురాలిగా మారిపోయింది. దలైలామాను కలసి ఆయన ఆశీస్సులు పొందింది. ముంబయిలో టిబెటన్ యోగా క్లాసెస్ నిర్వహించడం మొదలెట్టింది.దలైలామా శిష్యుడైన డాక్టర్ రీంపోచ్ ఠాకూర్ నిపెళ్లి చేసుకుంది.అతగాడు కొన్నాళ్ళు సన్యాసం తీసుకుని తర్వాత మామూలు జీవితంలో కొచ్చాడు.
ఠాకూర్ టిబెటన్ మెడిసిన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు.ఆయన తన చిన్నతనంలో మర్ఫీ రేడియో యాడ్ లో బేబీ గా నటించాడు. 61 ఏళ్ళ అందాల నటి ప్రస్తుతం పాత జ్ఞాపకాలను మర్చిపోయి ప్రశాంతంగా భర్తతో కాపురం చేసుకుంటోంది.
ముంబయి మాఫియా ఆగడాలు గురించి నిర్మాత ఏక్తా కపూర్ 2010 లో ‘వన్స్ అపాన్ ఆ టైం ఇన్ ముంబయి’ అనే సినిమా కూడా తీసింది. ఈ సినిమాలో దావూద్ , మందాకినీ పాత్రలని కూడా పెట్టారు.
—– KNM