Correction is necessary…………………………………….
స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ BSE సెన్సెక్స్ 1400 పాయింట్లు .. నిఫ్టీ 400 పాయింట్ల మేరకు పతనమైంది. (రాసే సమయానికి ) కారణాలు ఏమైనప్పటికి ఈ పతనం మంచిదే. గత కొన్నిరోజులుగా మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల లో ప్రతికూల వాతావరణం , కరోనా న్యూ వేరియంట్ భయాలు … ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలు మార్కెట్ ను డౌన్ ట్రెండ్ లోకి నెట్టి వేసాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మార్కెట్ బేరిష్ ట్రెండ్ లో పడొచ్చు. నిపుణులు అయితే ఈ కరెక్షన్ మరికొంత కాలం తప్పదని చెబుతున్నారు. అసలు మార్కెట్ ఎపుడో కరెక్షన్ కు గురి కావాల్సింది. కానీ మైనర్ కరెక్షన్లకే పరిమితమైంది.
ప్రస్తుతం మార్కెట్లను ప్రస్తుతం ఉత్తేజపరిచే అంశాలు ఏమి లేవు. ప్రపంచ దేశాలనుంచి ఇంకేదైనా శుభవార్త వచ్చినా మార్కెట్ రికవరీ బాటలో పడవచ్చు. ప్రస్తుతానికైతే కరెక్షన్ ప్రమాదం ఇంకా పొంచి వుంది అనే చెప్పుకోవాలి. మార్కెట్ ఇప్పటికే కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలోనే మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్ కి చేరుకుంది. షేర్ల వాల్యుయేషన్ పెరిగిపోయింది.
ఇదే పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగదు. ఏదో ఒక దశలో మార్కెట్ దిద్దుబాటుకి గురి కావాల్సిందే. అది ఇపుడు జరిగిందని అనుకోవచ్చు. కరెక్షన్ మార్కెట్ కి కొత్తేమి కాదు. గతం లో ఎన్నోసార్లు మార్కెట్ దిద్దుబాటు కి గురైంది . అనంతరం మళ్ళీ పుంజుకొని ఇన్వెస్టర్లకు లాభాలను అందించింది. పెరుగుట విరుగట కొరకే అన్నట్టు విరుగుట పెరుగట కొరకే అని భావించాలి.
కరెక్షన్ నిజం గా ఇన్వెస్టర్లకు మంచి అవకాశం. కరెక్షన్ కారణం గా పెరిగిన షేర్ల ధరలు తగ్గి ఇన్వెస్టర్లకు అందుబాటు లోకి వస్తాయి. కాబట్టి మార్కెట్ పడిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సమయం లో మార్కెట్ కదలికలను పరిశీలిస్తూ మంచి షేర్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవాలి.
ఫండమెంటల్స్ బలంగా ఉండి , మంచి వృద్ధిని సాధిస్తున్న షేర్లను ఎంపిక చేసుకొని మార్కెట్ స్థిరపడ్డాక మదుపు చేయాలి . షేర్ల ధరలు తగ్గుతున్నాయి కదా అని ఈ దశలో కొనుగోళ్లకు దిగడం కొంత రిస్క్ కూడిన వ్యవహారం. ఈ దశలో కొనుగోళ్ళకు దిగితే షేర్ల ధరలు మరింత పథానమైతే నష్ట పోయే ప్రమాదం వుందని చిన్నఇన్వెస్టర్లు ముఖ్యం గా గుర్తించాలి.
———KNM