Pak China Bhai Bhai……………….
చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నవంబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించాయి. ఈ సందర్భంగానే పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి.
పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు చైనాపైననే అధికంగా ఆధారపడుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్- 2023 నివేదిక ప్రకారం 80వ దశకంలో ఆఫ్ఘన్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అమెరికా నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసేది. 2005 నుండి 2015 వరకు పాకిస్తాన్.. చైనా నుండి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేసిందని ఆ నివేదిక వెల్లడించింది.
గత 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు చైనా 8,469 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అంతకుముందు గత 50 ఏళ్లలో, చైనా.. పాకిస్తాన్‌కు 8794 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. ఇంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం అమెరికా, రష్యా నుండి కూడా గరిష్ట సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంటుంది.
2015 నుండి పాకిస్తాన్ ఆయుధ అవసరాలలో 75 శాతం చైనా తీరుస్తున్నది. 2021లో పాకిస్తాన్.. చైనా నుండి హై-టు-మీడియం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ మిసైల్‌ను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో చైనా ఫిరంగి, రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తున్నారు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్‌తో కలసి నావికా విన్యాసాలు నిర్వహించిన సందర్భంగా చైనా తన ఆరు నౌకలను అరేబియా సముద్రంలో దించింది. ఈ నౌకల్లో గైడెడ్ మిస్సైల్ జిబో, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ జింగ్జౌ, లిని ఉన్నాయి.
ఇవి కాకుండా రెండు షిప్‌బోర్న్ హెలికాప్టర్లలో నావికాదళ సిబ్బంది విన్యానాల్లో పాల్గొన్నారు. అలాగే చైనా టైప్-093 సాంగ్ కేటగిరీకి చెందిన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌ను కూడా మోహరించింది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ తెలిపిన వివరాల ప్రకారం సీ గార్డియన్- 2023 నావికా విన్యాసాల ఉద్దేశ్యం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడమే.