చౌకధరలో జియో ల్యాప్ టాప్ ?

Sharing is Caring...

New laptap …………………………………………….

జియో మరో సంచలనం సృష్టించబోతోంది . రూ. 15 వేలకే ల్యాప్ టాప్ అందించే యోచనలో ఉన్నట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. చాలా కాలం నుంచి అదిగో ఇదిగో రిలీజ్ అంటున్నారు కానీ కంపెనీ నుంచి ప్రకటన మాత్రం రాలేదు. జియోబుక్ పేరిట తీసుకురానున్న ఈ ల్యాప్ టాప్ 4జీ ఆధారిత సిమ్ తో పనిచేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

జియో బుక్ తయారీ కోసం రిలయన్స్ జియో ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజాలైన క్వాల్ కామ్, మైక్రోసాఫ్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్వాల్ కామ్ ఎలక్ట్రానిక్స్ చిప్స్ ను అందించనుండగా.. మైక్రోసాఫ్ట్ కొన్ని యాప్ లకు కు విండోస్ OS తో మద్దతు  ఇస్తుందని చెబుతున్నారు.

ఈ ల్యాప్ టాప్ ధరను రూ.15,000గా నిర్ణయించే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. దీనిపై రిలయన్స్ జియో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.జియో బుక్ నవంబరులో మార్కెట్లోకి వస్తుందని సమాచారం. తొలుత స్కూళ్లు,కాలేజీలు, ప్రభుత్వ సంస్థలకు అందిస్తారని చెబుతున్నారు.

కొన్ని నెలల తర్వాత 5 జీ వెర్షన్‌ను కూడా విడుదల చేసే యోచనలో రిలయన్స్ ఉందని సమాచారం.ఈ ల్యాప్ టాప్ తయారీని దేశీయ కంపెనీ ‘ఫ్లెక్స్’కు అప్పగించినట్టు తెలుస్తోంది. మార్చి నాటికి భారీ సంఖ్యలో విక్రయించాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

జియోబుక్ రాకతో భారత్ లో ల్యాప్ టాప్ మార్కెట్ 15 శాతం విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. 2018 నుంచే జియో ల్యాప్టాప్ తయారీ కి పూనుకుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!