Be proud to be an Indian. ………………………………………………………………
ఏ దేశమేగిన ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు ఓ మహాకవి. వజ్రోత్సవ స్వరాజ్య సంబరాల సందర్బంగా మరోసారి మన దేశ ఖ్యాతిని మననం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వైదిక కాలం నాటి నుండి ఈ నేల భిన్న సంస్కృతులకు ఆచార వ్యవహారలకు నిలయం.
ప్రకృతిని దైవంగా పూజించిన కాలం లో అయినా, అగ్ని వాయువు వరుణులను పూజించిన కాలం అయినా, రాముడు కృష్ణుడు కాలంలో అయినా ఈ నేల మీద మతపర వ్యవహారాల్లో నియంత్రణ, నియంతృత్వం అన్నది ఉండటం మనకు కనపడదు.
ప్రతీ మనిషి తనకు నచ్చిన మతాన్ని,దైవాన్ని కొలుచుకునే స్వేచ్చా.. స్వాతంత్య్రం ఈ మట్టి సొంతం.వందలాది మతాలు,వేలాది కులాలు ఆచారాలు ఉన్నప్పటికీ ఈ దేశ పౌరులంతా ఒక్కటిగా ఐక్యమత్యంగా బ్రతకడం ప్రపంచానికే ఓ స్ఫూర్తినిస్తుంది.
విదేశీ రాజుల చేతిలో దాడులకు గురై వందల సంవత్సరాల పాటు బానిసత్వంలో బ్రతికినా కూడా ఈ దేశ ప్రజల ఐక్యతా భావము చెక్కు చెదరలేదు. చతుర్వేదాలు,పురాణాలు, ఉపనిషత్ లు , ఇంకా ఎన్నో వైజ్ఞానిక, వైద్య,సాంకేతిక శాస్త్రాలకు పుట్టినిల్లు మన దేశం.
చల్లని గాలుల నుండి దేశాన్ని కాపాడే హిమాలయాలు, సంవత్సరం మొత్తం పారే గంగా యమునా సరస్వతి జీవనదులు,ఈ భూమిలో ఉండే నిధి నిక్షేపాలు ఇలా సర్వసంపదలకు నిలయం మన దేశం. వరాహమిహిరుడు,ధన్వంతరి నాటి నుండి MS స్వామి నాథన్,కల్పనా చావ్లా,అబ్దుల్ కలాం,సుందర్ పిచాయ్ దాకా వ్యవసాయ రంగంలో అయినా,శాస్త్ర సాంకేతిక రంగాల్లో అయినా క్రీడా రంగంలో అయినా ఇలా అన్ని రంగాల్లో మున్ముందుకు సాగుతున్న దేశం మనది.
గాంధీ, భగత్ సింగ్,అల్లూరి, నేతాజీ లాంటి ఎందరో అమర వీరుల త్యాగాల ఫలం ఈ దేశం.
1947 ఆగష్టు 15న స్వాతంత్య్ర భారత దేశంగా ఆవిర్బవించిన దేశం 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా మారింది.ప్రపంచం లోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశంగా రాజ్యాంగం ప్రకారం సకల మతాలను ఆదరించే సెక్యూలర్ దేశంగా, శాంతి,అహింస లను ప్రపంచానికి బోధించిన దేశంగా ప్రఖ్యాతి పొందింది.
పౌరులకు వ్యక్తిగత హక్కులు, వాటికి న్యాయస్థానాల ద్వారా సంరక్షణ, ప్రజల చేత ఎన్నుకోబడే పాలకులు,
బ్యాంకుల జాతీయీకరణ, భారీ పరిశ్రమలు స్థాపన, పేదలకు సంక్షేమ పథకాలు వంటి వాటి ద్వారా ధనిక పేద తారతమ్యాలు తగ్గించి సామ్యవాద రాజ్య స్థాపన దిశగా సాగుతున్న దేశంగా మన దేశం పేరు పొందింది. వీటి వెనక అంబేద్కర్,నెహ్రూ,ఇందిరా వంటి నాయకుల కృషి ఎంతో ఉంది.
75వ స్వాతం త్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా దేశం మొత్తం ఆజాదికా అమృత ఉత్సవాలు దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో BPS Audio &Video, కొండపాక టీం తరఫున ఇటీవల యూట్యూబ్ లో విడుదలయిన దేశ భక్తి పాట అందరిని ఆకట్టుకుంటుంది.
పాటలో రచయిత మన దేశం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వర్ణించాడు. అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరం గల హిమాలయాలకు,గంగా యమున వంటి జీవ నదులకి, ఎంతో రమణీయమైన ప్రకృతి సౌందర్యాలకు నిలయం మన దేశం అని తెలియచేస్తాడు.
సకల జనుల సంక్షేమాన్ని కాంక్షించే ఈ భారత మాత బిడ్డలుగా జన్మ పొందినందుకు గర్వపడాలని ఎలుగెత్తుతాడు.
అలా పాట మొత్తం భారత దేశ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటేలా మంచి సాహిత్యాన్ని అందించాడు. అలాగే సంగీత దర్శకుడు సాకేత్ సాయిరాం అద్భుతమైన బాణీతో పాటకు మరింత అందం చేకూర్చాడు.
గాయని అనుపమ చెళ్ళపిళ్ళ,గాయకుడు గుంటి హరి గానం ఎంతో మధురంగా ఉంది. పల్లె అందాలను ఒడిసిపట్టే అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ పాట విజయంలో దర్శకుడు ఉదయ్ కుమార్,Camera man హరీష్ అరిగెలా కృషి అమోఘనీయం. అలాగే ఎడిటర్ మనోజ్ మేక ఎడిటింగ్ చాలా చక్కగా ఉంది.
పాటలో నటించిన నటీ నటులు సంతోష్,వివేక్,సాయి,వెంకటేష్, రాఘవేంద్ర టాలెంట్ స్కూల్ బృందం చాలా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు.నిర్మాత :సరస్వతి మురళి, పోస్టర్ డిజైన్ :లక్ష్మి ప్రసన్న అన్నివిధాలా అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకొని ఆజాది అమృతోత్సవం సందర్బంగా మన ముందుకు వచ్చిన ఈ పాట వజ్రోత్సవాల సంబరాలను ద్విగుణీకృతం చేసి ప్రజల్లో జాతీయ భావాలను తట్టిలేపేవిధంగా ఉంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
మీరు కూడా BPS Audio &Video యూట్యూబ్ ఛానల్ లో ఈ పాటను చూసి ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రోత్సాహం అందించండి. .