IRCTC Ayodhya-Kashi tour package ……………………
‘అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర’ పేరిట IRCTC ఒక టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇందుకోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడుపుతోంది. ఈ యాత్ర లో పూరి – కోణార్క్ – బైద్యనాథ్ ధామ్ – వారణాసి – అయోధ్య – ప్రయాగ్రాజ్ వంటి క్షేత్రాలను చూసి రావచ్చు.
ఈ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర 9 రాత్రులు/10 రోజుల పాటు సాగుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ,గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఆయా ఊర్లలోని యాత్రీకులు కూడా టికెట్ బుక్ చేసుకుని లోకల్ స్టేషన్స్ లో రైలు ఎక్కవచ్చు . తిరుగు ప్రయాణం లో అక్కడే దిగవచ్చు.
DAY 1… రోజు అంతా ప్రయాణం..
DAY 2… మధ్యాహ్నం 2 గంటలకు మాలతిపత్‌పూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడనుంచి రోడ్డు మార్గంలో పూరీకి వెళతారు.హోటల్ లో చెక్ ఇన్ అవుతారు.తర్వాత జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి బస పూరీలోనే.
DAY 3… ఉదయాన్నే అల్పాహారం తీసుకున్న తర్వాత,హోటల్ నుండి బయలుదేరి కోణార్క్ సూర్య దేవాలయానికి వెళతారు.తరువాత మాలతిపత్‌పూర్ రైల్వే స్టేషన్ కి వచ్చి , జాసిదిహ్ వెళ్లేందుకు రైలు ఎక్కుతారు
DAY 4… ఉదయం 6 గంటలకు జసిదిహ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.హోటల్ కి వెళ్లి రిఫ్రెష్ అయ్యాక బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ కి వచ్చి బెనారస్ వెళ్లడానికి రైలు ఎక్కుతారు.
DAY 5…..ఉదయం 9 గంటలకు బెనారస్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. సారనాథ్ కు బయలుదేరి హోటల్ లో చెక్ ఇన్ అవుతారు.రాత్రి అక్కడే బస చేస్తారు.
DAY 6…..అల్పాహారం తర్వాత, కాశీ విశ్వనాథ ఆలయం & కారిడార్, కాశీ విశాలాక్షి దేవి ఆలయాన్నిచూస్తారు. రోజంతా ముఖ్యమైన ప్రదేశాలను తిలకిస్తారు.సాయంత్రం గంగా ఆరతిని వీక్షిస్తారు. రాత్రి బస అక్కడే.
DAY 7… ఉదయం 7 గంటలకు అయోధ్యకు వెళ్లేందుకు బనారస్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కుతారు. 12 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ (అయోధ్య) చేరుకుంటారు. ఆలయ దర్శనాలు అయ్యాక అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో రాత్రి భోజనం చేసిన ప్రయాగ్‌రాజ్‌కు రైలు ఎక్కుతారు.
DAY 8.. ఉదయం 6గంటలకు ప్రయాగ్ సంగం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు.పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.మధ్యాహ్నం రెండుగంటలకు ప్రయాగ్‌రాజ్ నుండి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
DAY 9… రోజంతా ప్రయాణమే.
DAY 10.. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.. టూర్ ముగుస్తుంది.