అమెజాన్ ప్రైమ్ సూపర్ ఆఫర్ !

Sharing is Caring...

Attractive Offer………………….

ప్రముఖ OTT సంస్థ అమెజాన్  సరికొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రూ. 599 చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను  ఖాతాదారులు వినియోగించుకోవచ్చు.  
2016 సెప్టెంబర్ 5న జియో రాకతో దేశంలో డేటా విప్లవం మొదలైంది. జియో లాంచ్  కాక  ముందు.. ప్రతి భారతీయుడు నెలకు 154ఎంబీ డేటాను మాత్రమే వినియోగించేవాడు.

జియో లాంచ్ తర్వాత.. యూజర్ నెలకు 15. 8జీబీని వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో మెట్రో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అతి తక్కువ ధరకే మొబైల్ రీఛార్జ్  చేసుకొని ఇంటర్నెట్ ను వాడుకునే సింగిల్ యూజర్ల సంఖ్య పెరిగింది. అలాగే  మన దేశంలో 95 శాతం కుటుంబాలు ఒకే టీవీని కలిగి  ఉండటం తో  మొబైల్ లో వీడియో కంటెంట్ ను  చూసే వారి  సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇప్పుడు ఆ తరహా ప్రీపెయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని అమెజాన్ గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన ప్లాన్‌ను ప్రారంభించింది. తాజాగా ఆ ప్లాన్ లో సింగిల్ స్క్రీన్ పై ఏడాదికి రూ. 599 చెల్లించి లేటెస్ట్ మూవీస్, క్రికెట్ మ్యాచ్లు, వెబ్ సిరీస్ ను వీక్షించవచ్చు.

డెస్క్ ట్యాబ్లో సైతం ప్రైమ్ ను వీక్షించే సౌకర్యం ఉంది.  హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్  ఇప్పటికే ఈ తరహా ప్లాన్స్ అందిస్తున్నాయి. రూ. 599 కే అందుబాటులో కొచ్చే ఈ సదుపాయం లాభదాయకమే అని చెప్పుకోవచ్చు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!