యాక్షన్ ప్యాక్డ్ డ్రామా !

Sharing is Caring...

ఒక గ్యాంగ్ స్టర్  జీవిత కథే మాలిక్ సినిమా. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. భూ ఆక్రమణలు,దాడులు,అక్రమ వ్యాపారాలు, మతాంతర వివాహా పరిమాణాల వంటి ఘటనల సమాహారంగా సినిమా సాగుతుంది. కేరళ లోని తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి చుట్టూ కథ అల్లారు. కథ తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కానీ సినిమా నిదానంగా సాగుతుంది. కొంత కథ ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది.

చదువుకోకుండా చెడు స్నేహాల ప్రభావంగా గ్యాంగ్ స్టర్ గా మారిన సులేమాన్  పోలీసులను…రాజకీయ నేతలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో గ్రామంలో తుఫాన్ బాధితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో  రాజకీయ నాయకులు ప్రయివేట్ వ్యక్తులతో కలసి ఓ ప్రాజెక్టు చేపడుతుండగా సులేమాన్ అడ్డుకుంటాడు. అతగాడిని అడ్డు తప్పించడానికి పాత కేసులో హాజ్ యాత్రకు వెళ్లే తరుణంలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అక్కడ నుంచి జైల్లో సులేమాన్ ను చంపేసే ప్రయత్నాలు చేస్తారు. 

మేనల్లుడిచే చంపించే విధంగా ప్లాన్ చేస్తారు. ఆ మేనల్లుడు రాజకీయ నేతలపై రాళ్లు విసిరి జైలుకు వస్తాడు. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మేనల్లుడి గా అమన్ బాగా నటించాడు. మేనల్లుడు సులేమాన్ ను చంపడంలో విఫలమైనప్పుడు డాక్టర్ పాత్ర వచ్చి స్టెత్ గొంతుకు ను బిగించి చంపేస్తుంది. అలా ఎందుకు ఆ పాత్ర చేసింది అనే దానికి జస్టిఫికేషన్ చూపిస్తారు.పగ,ప్రతీకారం కథను నడిపిస్తాయి. ఈ సన్నివేశాలు పూర్తి నాటకీయంగా నడుస్తాయి. 

సులేమాన్ తల్లి కొడుకుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడానికి ముందు కొస్తుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది అనేది సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది. అలాంటి తల్లులు ఉంటారా అన్న సందేహం కూడా కలుగుతుంది. సులేమాన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఇమిడి పోయాడు. యువకుడిగా,మధ్య వయస్కుడిగా,వృద్ధుడిగా సహజరీతిలో నటించాడు.  సులేమాన్ భార్య పాత్రలో నిమిషా నటన ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. కథలో ఈపాత్ర కూడా ముఖ్యమైనదే.

డేవిడ్ పాత్రను కూడా ఆసక్తికరం గా మలిచారు. సినిమాలో ఘర్షణ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. రెలిజియస్ టచ్ ఉన్న ఈ కథ ను దర్శకుడు మహేష్ నారాయణ్ ఆసక్తికరంగానే తెర కెక్కించారు. ఫోటో గ్రఫీ .. సంగీతం ఆకట్టుకుంటాయి. అయితే ఈ తరహా కథలు అందరికి నచ్చవు. నిడివి ఎక్కువ … సినిమా ను కొంచెం ఓపికతో చూడాలి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ లేదు. మలయాళ వెర్షన్ లో చూడాలి. సబ్ టైటిల్స్ ఉన్నాయి. 

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!