Tried to please the audience ………………….
పృథ్వీరాజ్ చౌహాన్‌పై ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ తీశారు. ఇంట్లోని అమ్మమ్మలు కూడా ఆయన గురించి చెబుతుంటారు. వాట్సాప్‌లోనూ ఫార్వర్డ్ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో చాలావరకు కథలు మనకు ‘‘పృథ్వీరాజ్ రాసో’’ కావ్యంలో కనిపించేవే. అయితే, దీనిలో వివరించిన చాలా సంగతులు నిజం కాకపోవచ్చని ప్రముఖ చరిత్రకారులు, హిందీ పండితులు చెబుతున్నారు.
పృథ్వీరాజ్ కథ ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి. 1962 లో తమిళ భాషలో ఒక సినిమా వచ్చింది. ఇందులో పృథ్వీరాజ్ గా ఎంజీఆర్, సంయుక్త గా పద్మినీ నటించారు. అలాగే 1962 లో ఇదే కథ తో హిందీలో కూడా ఒక సినిమా తీశారు. తెలుగులో అది ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ పేరుతో అనువాదమై విడుదల అయింది. ‘ధరి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్’ పేరిట హిందీలో… .’పృథ్వీరాజ్ చౌహాన్, ది బ్రేవ్ వారియర్ ఆఫ్ ది ల్యాండ్’ పేరిట ఇంగ్లీష్ లో సీరియల్ నిర్మించారు.
ఇక ఇటీవల తీసిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ లో చౌహాన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషించారు. మానుషీ చిల్లర్ సంయుక్త గా నటించారు. ఈ చిత్రం లో దేశభక్తి.. ధైర్యసాహసాలను హైలైట్ చేసారు. ఇది యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చారిత్రక సినిమాను 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించింది.
మహమ్మద్ ఘోరీ పాత్రలో నటుడు మానవ్ విజ్ బాగానే నటించారు.ఈ చిత్రానికి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు.సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయాయి. అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ గా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారనే విమర్శలున్నాయి. అక్షయ్ కుమార్ వయసు పెరిగినట్టు తెలిసిపోతోంది. కొన్ని సన్నివేశాల్లో బాగానే నటించాడు.సన్నివేశాల కూర్పు పై దర్శకుడు మరింత కసరత్తు చేసి ఉంటె బాగుండేది
సినిమాలో యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.మరింత బాగా తీయవచ్చని అభిప్రాయం కూడా వ్యక్తమైంది. మనూషి చిల్లర్ సంయుక్తగా బాగానే చేసింది. ఆత్మాహుతి సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. పృథ్వి రాజ్ అంధుడిగా మారాక సింహం తో చేసే ఫైట్, ఘోరీ ని అంతమొందించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడవచ్చు.
సంజయ్ దత్, సోనూ సూద్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. 2022 జూన్‌లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది .. చూడని వారు చూడవచ్చు.