ఎవరీ తైమూర్ లాంగ్ ?ఆయన కథేంటి ?

Sharing is Caring...

He surpassed Genghis Khan in cruelty …………………………………..

తైమూర్ లాంగ్……….. నరరూప రాక్షసుడు.పెద్ద ఎత్తున నరమేధాలు చేసాడు. క్రూరత్వంలో ఛంఘీజ్ ఖాన్ ని మించినోడు. తైమూర్ కి పిల్లాపాపలు,మహిళలు,వృద్ధులు అనే విచక్షణ లేదు తన మతానికి మారకపోతే మారణహోమం సృష్టించేవాడు.

ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్, మధ్య ఆసియా చుట్టుపక్కల తైమూరిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1369లో  ఉజ్బెకిస్తాన్‌ లోని సమర్కాండ్ రాజుగా సింహాసనాన్నిఅధిష్టించిన తర్వాత తైమూర్ ప్రపంచ దేశాలను జయించాలన్న కాంక్షతో దండయాత్రకు బయలుదేరాడు.

వరుసగా అనేక దేశాలను జయించిన తైమూర్ 1398లో భారత్ దేశం చేరుకున్నాడు. తుగ్లక్ రాజవంశానికి చెందిన సుల్తాన్ నాసిర్-ఉద్-దిన్ మహ్మద్ తుగ్లక్ తైమూర్‌ను ఎదిరించడానికి ప్రయత్నించి ఓడిపోయాడు. 15 రోజుల్లో ఢిల్లీ ని దోచుకున్నాడు. అడ్డువచ్చిన వారిని నరికి పడేశాడు. హిందువుల తలలు తెగగొట్టి వాటిని ఢిల్లీ నడివీధిలో స్థూపం లాగా నిలబెట్టాడు. గుడులు కూలగొట్టాడు. ధనాన్ని దోచుకొని ఇళ్ళకు నిప్పుపెట్టాడు. సింధు నదిని దాటి వచ్చిన తైమూర్ మార్గమంతా విధ్వంసం సృష్టించాడు.

అతగాడి సైనికుల అరాచకాలకు అంతే లేదు.కనపడిన స్త్రీలను మానభంగం చేసేవారు. స్త్రీ, పురుషులను బందీలు చేసి బానిసలుగా తీసుకెళ్ళేవారు.అప్పట్లో మీరట్, షహరాన్ పూర్,ఇప్పటి హర్యానా లోని కొన్ని ప్రాంతాలు,హరిద్వార్ దేవపాలుడు అనే రాజు ఏలుబడిలో ఉన్నాయి. తైమూర్ గురించి తెలియగానే దేవపాలుడు అప్రమత్తమయ్యాడు. తైమూర్ అరాచకాల నుండి తన ప్రజలను కాపాడుకోవాలనే లక్ష్యంతో ప్రజలందరితో సమావేశమయ్యాడు.

జాట్, గుర్జర్, అహిర్, వాల్మీకి, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. తైమూర్ సైన్యంతో పోరాడేందుకు గెరిల్లా యుద్ధం చేయాలని నిర్ణయించారు. అన్నివర్గాల నుంచి లక్షమంది యోధులతో కూడిన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాంప్యారీ గుర్జార్ చౌహాన్ నాయకత్వంలో నలభై వేల మంది మహిళలతో కూడిన మహిళా రెజిమెంట్ ఏర్పడింది.

పురుష యోధులకు మహాబలి జోగరాజ్ సింగ్ గుర్జార్, హర్వీర్ సింగ్ గులియా నాయకత్వం వహించారు. రాంప్యారీ గుర్జార్ చౌహాన్ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని చౌహాన్ గుర్జార్ కుటుంబంలో పుట్టిన వీర మహిళ. రాంప్యారీ చిన్నతనం నుండి యుద్ద విద్యలో శిక్షణ పొందింది. అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నైపుణ్యం సాధించిన యోధురాలిగా ఎదిగింది. రాంప్యారీ గుర్జార్ చౌహాన్‌కు హర్దై జాత్, దేవి కౌర్ రాజ్‌పుత్, చంద్రో బ్రాహ్మణ్, రామ్‌దై త్యాగి వంటి మహిళలు సహాయకులుగా నియమితులయ్యారు.

తైమూర్ ను నిలువరించేందుకు వ్యూహ రచన చేశారు. ముందుగా నిస్సహాయులైన వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యతలు అప్పగించారు. తైమూర్ కదలికల పై కన్నేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. తైమూర్ సైన్యంతో వచ్చి ఆ ప్రాంతంలో విడిది చేశాడు.అతగాడి సైన్యం లక్షా నలభై వేలు. వచ్చే దారిలోనే గ్రామాలు ఖాళీగా ఉండటం చూసి తైమూర్ ఆశ్చర్య పోయాడు.

పొద్దు పోవడంతో అందరూ తమ శిబిరాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్దీ మంది మాత్రమే కాపలా కాస్తున్నారు.అందరూ మంచి నిద్రలో ఉండగా రాంప్యారీ మరికొందరు నాలుగు వైపులా నుంచి దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టు నరికి పడేశారు. హాహాకారాలతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది.ఇంతలో తెల్లవారింది.తైమూర్ కి ప్రమాదంలో చిక్కుకున్నామని అర్ధమైంది.

పారిపోయే ప్రయత్నం చేసాడు. ఈ లోగా దేవపాలుడి సైన్యం మళ్ళీ దాడి చేసింది. పెద్ద సంఖ్యలో సైనికులు హతులయ్యారు. రెండవరోజు.. మూడవరోజు తైమూర్ సైన్యంతో దేవపాలుని సైనికులు ప్రత్యక్ష యుద్ధం చేశారు.తైమూర్ ని హరిద్వార్ దాకా తరిమికొట్టారు. అక్కడ కూడా అతనిపై గిరిజనులు గెరిల్లా దాడులు చేసి చుక్కలు చూపించారు.

దీంతో అక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళుతుండగా గమనించిన హర్ బీర్ సింగ్ గులియా బాణాలు సంధించాడు. వాటి ధాటికి తైమూర్ గాయపడి నేలకొరిగాడు. అతని సైనికులు తైమూర్ ని తీసుకుని పారిపోయారు.కొన్నాళ్ళ తర్వాత తైమూర్ మరణించాడు. అలా గెరిల్లా యుద్ధ తంత్రంతో తైమూర్ సైన్యాన్ని ఊచకోత కోసింది రాంప్యారీ కాగా తైమూర్ ని హతమార్చింది హర్ బీర్ సింగ్. దేవపాలుడు తన వ్యూహంతో ప్రజలను కాపాడుకున్నాడు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!