ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు రాండాల్ జెఫ్రీస్. అతగాడు 800 మందికి తండ్రి అని తేలింది. ఇది నిజమేనా? అసలు సాధ్యమేనా ? ఈ వార్త చిత్రంగా ఉందికదా … నమ్మదగినది కాదనిపిస్తుంది. అయితే డీఎన్ ఏ పరీక్షలు మాత్రం నిజమే అంటున్నాయి. ఆ 800 మంది అతగాడికి పుట్టిన వాళ్ళే అని పరీక్షలు చెబుతున్నాయని “డైలీ న్యూస్” వెబ్సైటు అంటోంది.
దీంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఫొటోలో అతగాడు 97 ఏళ్ళ వయసులో అలా ఉన్నాడు కానీ ఒకప్పుడు అందగాడే. 1950-60 మధ్యకాలం లో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా శాన్ డియాగో ప్రాంతంలో రాండాల్ మిల్క్ మ్యాన్ గా పని చేసేవాడు. అప్పట్లో పాల సరఫరా ప్రతి ఊరికి పెద్ద పెద్ద క్యాన్లలో జరిగేది.అక్కడనుంచి సీసాలలో పంపిణీ చేసేవారు.
ఈ రాండాల్ కూడా అలా ఇంటింటికి తిరిగి పాల సీసాలు అందజేసేవాడు. ఈ సందర్భం గా అతగాడికి ఆ ప్రాంత మహిళలతో పరిచయాలు పెరిగాయి. కొంతమంది సన్నిహితులయ్యారు. రాండీ కి తినుబండారాలు కూడా ఇచ్చేవారు. అలా అలా పరిచయాలు పెరిగి పలువురితో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాండాల్ చెలరేగి పోయాడు. శృంగార పురుషుడి గా మారిపోయాడు.
రాండాల్ తో సన్నిహితంగా ఉన్న ఎంతోమంది మహిళలు గర్భం దాల్చారు. పిల్లల్ని కన్నారు. అప్పట్లో డీఎన్ఏ లాంటి టెస్టులు లేవు.. భర్తలకు అనుమానాలు వచ్చినా వ్యవహారం బయటికి రాకుండా గుట్టుగా ఉండిపోయే వారు. అసలు ఈ వ్యవహారం ఎలా బయటికి వచ్చిందంటే …
ఆ మధ్య కాలం లో శాండియాగో ఏరియా లో కొన్ని కేసులను పరిశోధన చేస్తున్న సందర్భంగా చాలా డీఎన్ఏల మధ్య పోలికలు కనిపించాయట. దీంతో అధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. మరిన్ని టెస్టులు చేశారు. అన్నింటిలోనూ రాండాల్ జఫ్రీస్ డీఎన్ ఏ ను పోలిన డీఎన్ ఏ లే కనిపించాయట.
సుమారు 800 వరకూ డీఎన్ఏలు ఒకేలా ఉన్నాయని లెక్కలు తేల్చారు. ఇదిలా ఉంటే రాండాల్ జఫ్రీస్కు అసలు పిల్లలే పుట్టలేదట. ఈ 97 ఏళ్ళ వయసులో ఈ విషయం విని సంతోష పడుతున్నాడట. మొత్తం మీద ఇదొక సంచలన విషయమే. రాండాల్ లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారో ?ఇలా డీఎన్ ఏ టెస్టులు చేస్తే ఎన్ని కాపురాలు కూలిపోతాయో ?? శృంగార వీర చక్ర లాంటి బిరుదులూ ఎవరైనా ప్రవేశ పెడితే ఇతగాడికి ఇవ్వొచ్చు.

