‘ధోలావీరా’ లో ఏమున్నది ?

Sharing is Caring...

It is a place worth seeing……………….

ధోలా వీరా …. సింధు లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ఇదొకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. ధోలావీరా లో క్రీస్తు పూర్వం 2650 నుంచే నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967… 68 లో అప్పటి దేశ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ జోషి కనుగొన్నారు. 1990 నుంచి తవ్వకాలు నిర్వహించారు.

ఈ తవ్వకాల్లో అబ్బురపరిచే విషయాలు బయటపడ్డాయి. అప్పట్లోనే ప్రజలు వాస్తును అనుసరించేవారని .. ప్రణాళిక ప్రకారం పట్టణాలను  నిర్మించారని కనుగొన్నారు. ఇంకా నాటి నిర్మాణాల శిధిలాలు , జంతువుల ఎముకలు, బంగారం, వెండి వస్తువులు లభ్యమయ్యాయి.

సింధూ నాగరికతలోని మొహంజదారో, హరప్పా తదితర ప్రాంతాల్లో ఇటుకలతో నిర్మాణాలు చేపట్టగా .. ఇక్కడ మాత్రం రాతితో కట్టారు. ఎడారి ప్రాంతం కావడంతో ప్రత్యేక పద్దతులతో రాతితో నిర్మించిన తటాకాలు ,కాలువలు ద్వారా నీటిని ఒడిసి పట్టారు.

ఈ ధోలావీరా గుజరాత్ లోని కచ్ జిలాల్లో ఉన్నది.ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన పట్టణం ఇది. 5 వేల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ అన్ని సదుపాయాలతో నగరం ఉండేది.పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ధోలా వీరా దక్షిణ గుజరాత్, సింధ్, పంజాబు, పశ్చిమాసియాల్లోని జనావాసాల మధ్య ప్రధాన వర్తక కేంద్రంగా విరాజిల్లింది.

పరిశోధనలో ఒక కోట, మధ్య పట్టణం, దిగువ పట్టణం. ఉన్నట్టు కనుగొన్నారు. ఇంకా రక్షణ నిర్మాణాలు, ద్వారాలు, వీధులు, బావులు, విశాలమైన బహిరంగ స్థలాలూ బయటపడ్డాయి. ప్రస్తుతం ఇవన్నీ శిధిలావస్థలో ఉన్నాయి.

సాధారణంగా రెండు భాగాలుగా విభజించబడిన హరప్పా నగరాల మాదిరిగా కాకుండా, ధోలావీరా మూడుగా విభజించబడింది.. ఒక కోట, మధ్య పట్టణం,దిగువ పట్టణం, ప్రతి దానికి సొంత రక్షణ గోడలు, ద్వారాలు ఉండటం విశేషం.

ధోలావీరాలో జలాశయాలు,కాలువలను చూస్తే అసాధారణమైన నీటి నిర్వహణ వ్యవస్థ కనిపిస్తుంది.
హరప్పా నగరాల్లో ఎక్కువ భాగం ఇటుకలను ఉపయోగించగా, ధోలావీరా గోడలు, ద్వారాలు, నివాస నిర్మాణాలలో రాతిని విస్తృతంగా ఉపయోగించారు. జలాశయాలలో నీటిని నిల్వ చేసేవారు.
చరిత్ర, సంప్రదాయాలు, పురావస్తు శాస్త్రం పై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం ఇది. భుజ్ పట్టణానికి చేరుకుంటే … అక్కడనుంచి టాక్సీ లలో ధోలావీరా కి వెళ్ళవచ్చు. అక్కడ గైడ్స్ అందుబాటులో ఉంటారు.  ధోలావీరా వద్ద రెండు రిసార్ట్స్ ఉన్నాయి. గుజరాత్ వెళితే ఈ ధోలావీరా ను చూసి రండి. 

Watch it  ……………………………………………. ‘ధోలావీరా’ లో ఏమున్నది ?

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!