విరాళాల సమీకరణలో బీజేపీ దే ప్రధమ స్థానం !

Sharing is Caring...

Political parties fund raising………………… విరాళాల సమీకరణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచింది.మరే జాతీయ పార్టీ బీజేపీ దరిదాపుల్లో లేదు.  2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి దేశం లోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విరాళాల లెక్కలను సమర్పించాయి. ఆ లెక్కల ప్రకారం బీజేపీ కి అత్యధికంగా 785. 77 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి ఆ మొత్తం అందాయని బీజేపీ చెబుతోంది. బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కు చెందిన జూపిటర్ క్యాపిటల్ తో పాటు, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్,తదితర కార్పొరేట్ కంపెనీల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో ఆ  విరాళాలు అందాయి. అంతకు ముందు సంవత్సరం అయితే బీజేపీ కి  1612 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే  2019-20 సంవత్సరంలో 139. 01 కోట్ల రూపాయల విరాళాలే అందాయి. ఆ మొత్తంలో ఎన్నికల బాండ్ల రూపేణా 58 కోట్లు ఉన్నాయట. బహుజన్ సమాజ్ పార్టీ కి 2019-20 సంవత్సరంలో విరాళాలు అసలు అందలేదట. 2017-18 సంవత్సరంలో 738 కోట్ల విరాళాలు అందుకున్న ఆపార్టీ జీరో స్థాయి కి పడిపోవడం చిత్రంగా ఉంది. విరాళాలపై పార్టీ అంతగా దృష్టి పెట్టినట్టు లేదు. ఇక నేషనిస్ట్ కాంగ్రెస్ పార్టీ 59. 94 కోట్ల విరాళాలను రాబట్టుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా విరాళాల విషయం లో వెనక బడింది. ఆపార్టీ 8.08 కోట్లు మాత్రం అందాయి. కమ్యూనిస్టుల లో సీపీయం 8.08 కోట్లు,సీపీఐ 1. 29 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందుకున్నట్టు తెలిపాయి. ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలను ఆ పార్టీలు వ్యతిరేకించాయి.

ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే తెరాస 130. 46 కోట్లు రాబట్టుకోగలిగింది. శివసేన కు 111 కోట్ల రూపాయలు అందాయి. వైసీపీ 92.7 కోట్ల రూపాయలను సమీకరించింది. అన్నా డీఎంకే 89. 6 కోట్లు .. డీఎంకే 64. 90 కోట్ల మేరకు విరాళాలు అందుకున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!