రష్యా దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ !

Sharing is Caring...

Russia Attacks …………………………….

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. బాంబు దాడులతో భయభ్రాంతులను చేస్తోంది. రష్యా మిలటరీ సేనలు ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి.రాజధాని కీవ్ తో పాటు 11 నగరాలను స్వాధీనం చేసుకునే యత్నాల్లోఉన్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో దాక్కున్నారు. 

కాగా ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని రష్యా అధినేత పుతిన్ మిగతా దేశాలను  హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా రష్యా యుద్ధానికి దిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.  ప్రపంచ దేశాల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్ పై పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తోంది.

ఆ దేశంలోని రెండు వేర్పాటు వాద ప్రాంతాల్ని ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ .. అక్కడి నుంచే మిగతా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టింది.  ఉక్రెయిన్ చుట్టూ రష్యాకు చెందిన లక్షన్నర మందికి పైగా మిలిటరీ సైన్యం మోహరించింది.అష్టదిగ్బంధనం చేసే యోచనలోఉంది.

ఉక్రెయిన్ లో ఆపరేషన్ మొదలు పెట్టిన వెంటనే సరిహద్దులను రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. రష్యా దాడి మూలంగా  ఉక్రెయిన్‌లో 18 చోట్ల  300 మంది పౌరులు మరణించారని వార్తలు అందుతున్నాయి. ఉక్రెయిన్ లోని 23 ప్రాంతాలపై  రష్యా బాలిస్టిక్‌ మిస్సైల్‌ ఎటాక్‌ జరుగుతోంది. ఈ దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ కూడా ఎదురుదాదులు మొదలు పెట్టింది.

పలు చోట్ల బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో ఎదురు దాడి మొదలు పెట్టింది.యుద్ధం మొదలైన క్రమంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వం మార్షల్‌ లా ప్రకటించింది.  సురక్షిత ప్రాంతాల్లో పౌరులు ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్‌ ప్రభుత్వం కోరింది.

రష్యా మొదలెట్టిన ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరిస్తూ ప్రకటన చేశారు.  ఉక్రెయిన్‌పై రష్యా దాడి అన్యాయమని…  యుద్ధం కారణంగా  సంభవించే మరణాలు, సంక్షోభాలకు  రష్యానే  బాధ్యత వహించాల్సి ఉంటుందని  బైడెన్ హెచ్చరించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!