ఆమె జీవితంలో ఎన్ని ట్విస్టులో ??

Sharing is Caring...

Hasty decisions ……….

కుంభమేళాలో పూసలమ్ముతూ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన మోనాలిసా (అసలు పేరు మోనాలిసా భోస్లే) జీవితం ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఆమె చట్టపరమైన, వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకుంది.కేరళలో ఒక షెల్టర్ హోమ్ లో ఉంటోంది. 

మోనాలిసా తన తండ్రి ఇష్టానికి విరుద్ధంగా, మార్చి 11, 2026న కేరళలోని ఒక హిందూ ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. తన తండ్రి తనకు బలవంతంగా వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడని ఆమె కేరళ పోలీసులను ఆశ్రయించింది.ఈ పెళ్లిపై ఆమె కుటుంబం,కొన్ని హిందూ సంఘాలు ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేశాయి.

అయితే,తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, తమకు ప్రాణహాని ఉందని ఆ జంట కేరళలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రక్షణ కోరింది. అంత వరకు బాగానే కానీ పెళ్లి నాటికి ఆమె మైనర్ అని తేలడంతో  కథ మరోమలుపు తిరిగింది .

నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) విచారణలో మోనాలిసా ఇంకా మైనర్ తేలిపోయింది.   ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె పుట్టిన తేదీ డిసెంబర్ 30, 2009. అంటే మార్చి 2026లో ఆమె వివాహం జరిగే నాటికి ఆమె వయస్సు 16 ఏళ్ల 2 నెలలు మాత్రమే.

ఆమె మైనర్ కావడంతో, ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై  మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అదనంగా ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి.ఈ ఫర్మాన్ ఖాన్ మహారాష్ట్ర కు చెందినవాడు. ఇద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం అయింది.  

ప్రస్తుతం ఈ కేసు కేరళ హైకోర్టు,మధ్యప్రదేశ్ పోలీసుల పరిధిలో ఉంది. ఆమె భర్త ఫర్మాన్ ఖాన్‌కు కేరళ హైకోర్టు మే 20, 2026 వరకు అరెస్టు నుండి మధ్యంతర రక్షణ కల్పించింది. ఇపుడు ఆమె  కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది.ఇక మోనాలిసా నటించాల్సిన సినిమా ప్రాజెక్టులు తాత్కాలికంగా ఆగిపోయాయి..

‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ (The Diary of Manipur)… ఆమెను వెండితెరకు పరిచయం చేయాల్సిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే, మోనాలిసా తన వివాహం తర్వాత ఈ సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేయడంతో, ఆయన ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

శ్రీను కోటపాటి దర్శకత్వంలో ‘లైఫ్’ అనే తెలుగు సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత వివాదాల వల్ల ఈ సినిమా ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత లేదు. కైలాష్‌తో కలిసి ఆమె ‘నాగమ్మ’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. దీని షూటింగ్ కేరళలో జరగాల్సి ఉంది. అది కూడా తాత్కాలింగా వాయిదా పడింది. 

మొత్తం మీద ఆమె మైనర్ అని తేలడం, ఆమె భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో (POCSO) కేసు నమోదు కావడం, దర్శకుడు సనోజ్ మిశ్రాపై ఆమె వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆమె సినీ కెరీర్ ప్రస్తుతం అయోమయంలో పడింది.మోనాలిసా జీవితం పలు మలుపులు తిరగడానికి అమాయకత్వం, సరైన మార్గనిర్దేశం లేకపోవడం. గ్లామర్ ప్రపంచం పట్ల ఆకర్షణ.. ఈ మూడూ ప్రధాన కారణాలని చెప్పవచ్చు..

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!