యుద్ధ విమాన ప్రయోగంలో చైనా దూకుడు!

Sharing is Caring...

Ravi Vanarasi ……..

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘ఐదవ తరం (Fifth-Generation)’ J-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటాపుల్ట్ (EMALS – Electromagnetic Aircraft Launch System) సహాయంతో విజయవంతంగా ప్రయోగించిన తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది!

గత కొన్ని దశాబ్దాలుగా నౌకాదళ విమానయానంలో అమెరికా నౌకాదళానికి మాత్రమే సొంతమైన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు చైనా సాధించింది. చైనా కొత్త అతిపెద్ద విమాన వాహక నౌక (Aircraft Carrier) ‘ఫుజియాన్’ (Fujian – Type 003) ఈ అపూర్వమైన ప్రయోగానికి వేదికైంది.

కేవలం J-35 మాత్రమే కాక, J-15T ఫైటర్, KJ-600 ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా ఈ అత్యాధునిక ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వ్యవస్థ ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (PLAN) ధృవీకరించింది.

సాంప్రదాయకంగా విమాన వాహక నౌకల నుండి విమానాలను ప్రయోగించడానికి ‘ఆవిరితో నడిచే కాటాపుల్ట్స్’ (Steam Catapults) లేదా ‘స్కి-జంప్ రాంప్‌లు’ (Ski-Jump Ramps) ఉపయోగించేవారు. కానీ, ఈ EMALS వ్యవస్థ ఒక అద్భుతమైన వేదికగా మారింది. విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి విమానాలను వేగంగా, స్థిరంగా ప్రయోగిస్తుంది.

స్టీమ్ కాటాపుల్ట్‌ల మాదిరిగా కాకుండా, EMALS ద్వారా విమానం పూర్తి ఇంధనం, పూర్తి ఆయుధాలతో (Full Fuel and Armament Load) టేకాఫ్ చేయవచ్చు. దీని వలన J-35 పోరాట పరిధి (Combat Radius) టార్గెట్ ను దెబ్బతీసే సామర్థ్యం (Strike Capability) గణనీయంగా పెరుగుతుంది.

ఇది కేవలం 45 సెకన్లలో మరొక విమానాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది సాంప్రదాయ వ్యవస్థల కంటే చాలా వేగంగా పనిచేస్తుంది.ఈ వ్యవస్థ ను చాలా సులభంగా నిర్వహించవచ్చు.విమానం పై ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

J-35 అనేది చైనా నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ఐదవ తరం స్టెల్త్ ఫైటర్. ఇది రష్యా, అమెరికా తర్వాత ఈ స్థాయి అధునాతన విమానాలను విమాన వాహక నౌకల నుండి ఆపరేట్ చేయగల సామర్థ్యాన్ని చైనా అంది పుచ్చుకుంది.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా J-35 ఐదవ తరం స్టెల్త్ జెట్, EMALS వ్యవస్థ నుండి ప్రయోగించబడిన విమానంగా రికార్డు సృష్టించింది.

అమెరికా వారు F-35C జెట్‌ను సైతం ఇప్పటికీ ఆవిరి కాటాపుల్ట్‌ల నుండే ప్రయోగిస్తున్నారు.చైనా సాధించిన ఈ విజయం చుట్టుపక్కల దేశాలకు, ముఖ్యంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో చైనా తన శక్తిని మరింత దూకుడుగా ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది.

చైనా ఇప్పుడు *’లియోనింగ్ (Liaoning)’ ‘షాన్‌డాంగ్ (Shandong)’ తరువాత ‘ఫుజియాన్’ తో కలిపి మొత్తం మూడు విమాన వాహక నౌకలను కలిగి ఉన్న దేశంగా మారింది. 80,000 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఫుజియాన్, అమెరికా ‘గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ (Gerald R. Ford)’ తరగతి సూపర్-క్యారియర్‌లకు సమానమైన సాంకేతికతను ఉపయోగిస్తోంది.

ఈ ‘ఫుజియాన్’ అభివృద్ధి తో చైనా నౌకాదళం కేవలం తీరప్రాంత రక్షణ (Coastal Defence) నుండి బ్లూ-వాటర్ నేవీ (Blue-Water Navy) గా మారుతున్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. అంటే, చైనా ఇప్పుడు తన సైనిక శక్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుదూర సముద్ర జలాల్లో ప్రదర్శించే స్థాయికి చేరుకుంది. 

చైనా సాధించిన ఈ అద్భుతమైన సాంకేతిక విజయం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, ప్రపంచ నౌకాదళ శక్తి సమతుల్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది అమెరికాకు ఒక పెద్ద సవాల్ అవుతుందా?అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!