త్రినాథ్ రావు గరగ …………………..
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా విజయం సాధించారు యువ నటుడు తేజ సజ్జ. ఆ సినిమా తర్వాత మరోసారి మైథాలజీ, సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు ‘మిరాయ్’ చేశారు. మంచు మనోజ్, శ్రియ శరణ్ ,జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలు చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించింది.
టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. హనుమాన్ తో ఓవర్ నైట్ సూపర్ హీరో అయిపోయాడు. ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు బ్లాక్ బస్టర్ తో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘మిరాయ్’ మూవీ అనౌన్స్ కావడం.. ఇదీ సూపర్ హీరో మూవీ అనడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. ఈ మూవీ టైటిల్ నుంచి ప్రమోషన్స్ వరకూ ప్రతిదీ ఆకట్టుకుంది.
తొమ్మిది మహిమాన్విత గ్రంథాల సాయంతో అమరత్వాన్ని సాధించి ..ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకునే ఓ దుష్టశక్తికి.. ఆ వినాశాన్ని అడ్డకోవాలనుకున్న ఓ సామాన్య మానవుడికి మధ్య జరిగిన సమరమేఈ చిత్ర కథ.. తేజ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ ఫాంటసి అడ్వెంచర్ ను కార్తీక్ ఘట్టమనేని ఆకర్షణీయంగా తెరకెక్కించాడు.
తేజ తన భుజాలపై ఈ ప్రమోషన్స్ ను మోశాడు. మరి అతని కష్టానికి తగ్గ రిజల్ట్ వచ్చిందా లేదా అంటే నూటికి నూరు శాతం వచ్చిందనే చెప్పాలి.మిరాయ్ కూడా హనుమాన్ లా ప్యాన్ ఇండియా స్థాయి సినిమానే..సరిగ్గా అలాంటి కంటెంట్ తోనే వచ్చాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ప్రభాస్ వాయిస్ ఓవర్ మరింత గంభీరతను తీసుకొచ్చింది.
సాధారణంగా మొదలైన ఫస్టాఫ్ హీరోయిన్ ఎంట్రీ తో కథనంలో వేగం పుంజు కుంటుంది.మరోవైపు మంచు మనోజ్ క్రూరమైన విలనీ.. ఇక్కడ దర్శకుడు మనోజ్ ను అత్యంత బలవంతుడైన విలన్ గా చూపించిన విధానం బావుంది.
మంచు మనోజ్ ను మన తెలుగు పరిశ్రమ సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది.ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మిరాయ్ ని సాధించే క్రమం అంతా వేరే లెవెల్. ఆ క్రమంలో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఎక్సెల్లెంట్ అంటే చిన్న మాటే అవుతుంది.
మిరాయ్ విజువల్స్ ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకువెళతాయి. మరి ఈ సినిమాలో లోపాలు లేవా అంటే ఉన్నాయి.జనాలు కన్విన్స్ అయ్యేలా ఉన్నాయి. దర్శకుడు హీరో పాత్రను సినిమాటిక్ లిబర్టీతో కొంచెం కన్వినియంట్ గా రాసుకున్నాడనిపించింది.
హీరోకు ఎదురయ్యే కష్టాలు సినిమాలో అగస్త్యముని చెప్పినట్టుగా ఉండవు. చాలా సింపుల్ గా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వాటి గురించి చర్చించడం అనవసరం.ఎమోషన్,యాక్షన్,డివోషన్ ని ప్రాపర్ గా బాలన్స్ చేసినప్పుడు లోపాలు ఉన్నా అవన్నీ పక్కకు వెళ్లిపోతాయి.
మిరాయ్ విషయంలో అదే జరిగింది.ప్రతీ సీన్ హైలెట్ అవుతున్నట్టే అనిపిస్తుంది.సెకండాఫ్లో సినిమా డౌన్ అవుతున్నపుడు ఏదో ఒక యాక్షన్ సీన్ వచ్చి నిలబెట్టింది.ఇలాంటి సినిమాను బిగ్ స్క్రీన్ పై ఫ్యామిలీతో కలిసి చూస్తే భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా పిల్లలకు కూడా నచ్చుతుందీ సినిమా.
ఈ సినిమాలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, తేజ సజ్జ, మంచు మనోజులతో పాటు ఇంకో హీరో కూడా ఉన్నాడు అతనే మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర..ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అతను పెట్టిన ఎఫర్ట్, చూపించిన ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే.
కథలో కీలకమైన ఘట్టాల్లో హరి నేపథ్య సంగీతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. భారీ పక్షి అవతారంతో ముడిపడ్డ ఇంటర్వెల్ ఎపిసోడ్లో స్కోర్ అద్భుతం అనే చెప్పాలి. ద్వితీయార్ధమంతా ఆకట్టుకునే విధంగా సాగింది ఆర్ఆర్. పతాక ఘట్టాల్లో థీమ్ మ్యూజిక్ స్కోర్ నెక్స్ట్ లెవెల్..వెండితెరపై ఓ విజువల్ గ్రాండియర్ మిరాయ్.
మైథాలజీ నేపథ్యంలో కొత్త సూపర్ హీరో కథను దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని చెప్పిన తీరు అద్భుతం..చివరగా పురాణం,చరిత్ర కలగలిపిన కొత్త ఆయుధం మిరాయ్. ఇది ఖచ్చితంగా హిట్ ఫార్ములా.ముందు ముందు పురాణ ఇతిహాసాలకు సంబంధించి మన దర్శకులు మరెన్ని కొత్త ఆయుధాలతో ముందుకు వస్తారో వేచి చూడాలి..

