అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలను చూసొద్దామా ?

Sharing is Caring...
KERALA HILLS & WATERS IRCTC Tour………..

కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు  IRCTC  కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరిట ఒక ప్యాకేజీని నిర్వహిస్తోంది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి రైలులో వెళ్లి అలెప్పీ ,మున్నార్ ప్రాంతాలను చూసి రావచ్చు.

ఈ టూర్‌ ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది.అక్టోబర్ 8,14,28 తేదీలలో ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంది. 

DAY..1 …. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 12:20 గంటలకు టూర్ మొదలవుతుంది .. రైలు నెం.17230, శబరి ఎక్స్‌ప్రెస్‌ లో ఎక్కుతారు . రాత్రి అంతా ప్రయాణం సాగుతుంది.

DAY..2… ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ కు 12:55 గంటలకుడ్రైవ్ చేసుకుంటారు. హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. మున్నార్ టౌన్ లో సాయంత్రం విశ్రాంతి తీసుకుంటారు. రాత్రికి మున్నార్ లో బస చేస్తారు.

DAY..3.. ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ ను చూస్తారు. తరువాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ & ఎకో-పాయింట్ ను సందర్శిస్తారు. రాత్రికి మున్నార్‌లో బస చేస్తారు .

DAY 4. హోటల్ చెక్ అవుట్ చేసి అల్లెప్పి బయలుదేరుతారు.అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. బ్యాక్ వాటర్స్‌ అందాలను తిలకించడానికి వెళతారు. అల్లెప్పిలో రాత్రి బస చేస్తారు.

DAY .5..హోటల్ చెక్ అవుట్ చేసి ఎర్నాకులం బయలుదేరుతారు. ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌లో 17229 నంబర్ రైలు శబరి ఎక్స్‌ప్రెస్ 11:20 గంటలకు ఎక్కుతారు. రాత్రంతా ప్రయాణం సాగుతుంది.

DAY 6.. 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.దీంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజి ధరలు ఇలా ఉన్నాయి…

ఇతర వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అధికారిక వెబ్‌ సైట్ చూడండి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!