‘Sundar Saurashtra’IRCTC tour package ……………..
గుజరాత్ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో చూసే అవకాశాన్ని IRCTC కల్పిస్తోంది.’సుందర్ సౌరాష్ట్ర’ పేరిట IRCTC ఒక ప్యాకేజి ని నిర్వహిస్తోంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఈ టూర్ సాగుతుంది.
DAY .. 1.. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్-పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది.
DAY .. 2. ఉదయం 11 గంటలకు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు.కాసేపు సేద తీరాక మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని వీక్షించి తిరిగి వడోదరా చేరుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
DAY .. 3.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని వీక్షించి అహ్మదాబాద్ బయల్దేరుతారు. అక్కడ సబర్మతీ ఆశ్రమాన్ని… అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అహ్మదాబాద్‌లో బస ఉంటుంది.
DAY 4.. ఉదయాన్నే ద్వారకకు (440 కి.మీ) బయలుదేరుతారు.దారిలో జామ్‌నగర్ లఖోటా ప్యాలెస్, మ్యూజియం సందర్శిస్తారు.సాయంత్రం కి ద్వారక చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ద్వారకలో రాత్రి బస చేస్తారు.
DAY .. 5 … ఉదయం ద్వారక పయనమవుతారు. మార్గం మధ్యలో సమయం ఉంటే జామ్‌నగర్ సందర్శనకు తీసుకెళ్తారు.హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాక ద్వారకను సందర్శిస్తారు. ఆ రాత్రి ద్వారకలోనే రాత్రి బస ఉంటుంది.
DAY.. 6..ఉదయం ద్వారకాదీష్ ఆలయాన్ని, తర్వాత బెట్ ద్వారక, నాగేశ్వరాలయాన్ని సందర్శిస్తారు. ద్వారకలో రాత్రి బస చేస్తారు.
DAY .. 7.. హోటల్ రూమ్ ఖాళీ చేసి సోమనాథ్ (240 కి.మీ.)కి బయలు దేరుతారు.దారిలో పోర్బందర్ కీర్తి మందిర్, సుధామ దేవాలయాన్ని సందర్శిస్తారు. తర్వాత సోమనాథ్ చేరుకుని సోమనాథ్ జ్యోతిర్లింగ్, చుట్టుపక్కల దేవాలయాలను చూస్తారు. సాయంత్రం పోర్‌బందర్‌కి బయలుదేరుతారు. అర్థరాత్రి పోర్‌బందర్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతారు.రాత్రంతా ప్రయాణం
DAY .. 8 .ఉదయం 8:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ పూర్తవుతుంది.
యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది. నాలుగు రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది. ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.
టూర్ ప్యాకేజీలో ఉండే సందర్శనా ప్రదేశాల రుసుముల బాధ్యత ఐఆర్‌సీటీసీదే.రైలు ప్రయాణంలో ఆహారాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి. బోటింగ్, గుర్రపు స్వారీకి యాత్రికులే రుసుము వెచ్చించాలి.టూర్ గైడ్ సదుపాయం ఉండదు.
యాత్రకు సంబంధించి చార్జీలు ఇలా ఉంటాయి.. ఇతర వివరాలకు……
Contact
IRCTC – South Central Zone
9-1-129/1/302,3rd Floor, Oxford Plaza,
S.D. Road, Secunderabad, Telangana
Mob: 8287932229 / 9701360701