తక్కువ బడ్జెట్‌లో ‘డివైన్‌ కర్ణాటక’ టూర్‌ !

Sharing is Caring...

IRCTC ‘Divine Karnataka’ Package……………………..

IRCTC తాజాగా ‘డివైన్‌ కర్ణాటక’ పేరుతో ఓ స్పెషల్‌ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ టూర్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. 5 రాత్రులు 6 రోజులు ఈ టూర్‌ సాగుతుంది.   

అక్టోబర్‌నెలలో  1, 8, 15, 22, 29 తేదీలలో  అంటే ప్రతి మంగళవారం ఈ టూర్ ప్యాకేజి  అందుబాటులో ఉంటుంది.   ఈ డివైన్ కర్ణాటక  సంబంధించి ముందస్తు రిజర్వేషన్‌లు మొదలైనాయి. ఇంతకీ టూర్‌ ప్యాకేజీలో కవర్ అయ్యే  ప్రాంతాలు,  ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్యాకేజీ లో 3 రోజులు బ్రేక్ ఫాస్టు అందిస్తారు. ఇక భోజనం ఖర్చులు పర్యాటకులు భరించాలి.   

*  ఫస్ట్ డే  ఉదయం 6:05 గంటలకు కాచిగూడ- మంగళూర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం: 12789) ఎక్కగానే టూర్ మొదలవుతుంది. ఆ రాత్రంతా  ప్రయాణం ఉంటుంది.

* సెకండ్ డే  ఉదయం 9.30 గంటలకు మంగళూరు చేరుకుంటారు. అక్కడినుంచి ఉడిపికి  వెళ్లి, ముందుగానే బుక్ చేసిన  హోటల్‌లో ఫ్రెషప్‌ అయ్యాక  శ్రీకృష్ణ ఆలయం, మాల్పే బీచ్‌ సందర్శన ఉంటుంది. ఆ రాత్రి ఉడిపిలోనే  బస చేస్తారు. 

* ఇక థర్డ్ డే  ఉదయం శృంగేరీ కి వెళతారు. అక్కడ శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత  మంగళూరు వెళతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. 

* ఫోర్త్ డే  ఉదయం ధర్మస్థల చేరుకుంటారు. అక్కడ  మంజునాథ స్వామి ఆలయాన్ని, కుక్కే సుబ్రమణ్య టెంపుల్ ను  దర్శించుకుంటారు.సాయంత్రం తిరిగి మంగళూరుకు బయలుదేరి వస్తారు.. ఆ రాత్రి  అక్కడే బస చేస్తారు.

* ఇక ఫిఫ్త్ డే  …  మంగుళూరు లోని పురాతన మంగళదేవి ,కద్రి మంజునాథ ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తన్నెరభావి బీచ్‌, కుద్రోలి గోకర్నాథ దేవాలయం చూస్తారు.  ఆ పిదప  మంగళూరు రైల్వేస్టేషన్‌ చేరుకుని, రాత్రి 8 గంటలకు (ట్రైన్‌ నం: 12790) రైలు ఎక్కుతారు.

*  సిక్స్త్ డే …  రాత్రి 11.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో యాత్ర ముగుస్తుంది.

ఛార్జీలు ఇలా ఉంటాయి. 

ఛార్జీల విషయానికొస్తే.. రూమ్‌ సింగిల్‌ షేరింగ్‌ అయితే  రూ.38,100 ..ట్విన్‌ షేరింగ్‌కు రూ. 22,450, ట్రిపుల్ షేరింగ్ కు  రూ. 18150గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు  విత్‌ బెడ్‌ రూ. 11430, విత్‌ అవుట్ బెడ్ రూ. 9,890  చెల్లించాలి. .స్లీపర్‌ బెర్త్‌కు … థర్డ్‌ ఏసీకి ప్రత్యేకంగా ఛార్జీలను నిర్ణయించారు. సెలెక్ట్ చేసుకున్న  ప్యాకేజీ ఆధారంగా వసతి సదుపాయాలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం   IRCTC వెబ్సైటు చూడండి. లేదా  ఈ నంబర్లను  8287932229 / 9701360701 సంప్రదించండి. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!