కేరళ వెళ్లే పర్యాటకుల కోసం IRCTC టూర్ ప్యాకేజీ !!

Sharing is Caring...

 

To see the green nature .. we have to go to Kerala..

కేరళ ప్రకృతి అందాలకు నెలవు .. అక్కడి అందాలను .. జలపాతాలను .. పచ్చని ప్రకృతిని వీక్షిస్తుంటే మనసు మరో లోకంలో  విహరిస్తుంది.. మధురానుభూతులు కలుగుతాయి. తొలకరి జల్లుల్లో తడుస్తూ .. అలాంటి అనుభూతులు సొంతం చేసుకోవాలని కోరుకునే పర్యాటకులకోసం IRCTC  మంచి  టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. 

కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌ పేరిట IRCTC  ఈ టూర్‌ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 5 రాత్రులు/6 రోజుల పాటు సాగే  ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది..  ప్రయాణ వివరాలు కింది విధంగా ఉంటాయి. ప్రతి మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. 

* మొదటి రోజు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణం  ప్రారంభమవుతుంది.  మధ్యాహ్నం 12. 20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నెంబర్‌ 17230లో ఎక్కాల్సి ఉంటుంది.

* రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు అలువా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.  అక్కడి నుంచి మున్నార్  వెళ్లి హోటల్‌లో బస చేస్తారు.  మధ్యాహ్నం అంతా రెస్ట్.. సాయంత్రం మున్నార్‌ సిటీ ని చూపిస్తారు.  తిరిగి వచ్చి హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం బయలు దేరి ఎర్వికుల్‌ నేషనల్‌ పార్క్‌, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్‌, ఎకో పాయింట్ ని సందర్శిస్తారు. రాత్రి బస మున్నార్‌లో నే . * నాలుగో రోజు ఉదయం బయలు దేరి అల్లెప్పీ చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత హోటల్‌లో చెకిన్‌ అవుతారు.  అలెప్పీలో బ్యాక్‌ వాటర్‌ అందాలను వీక్షిస్తారు. బోట్ రైడ్ చేసేవాళ్ళు చేస్తారు. ఆ రాత్రికి అల్లెప్పీ లో విశ్రాంతి తీసుకుంటారు. 
*  5వ రోజు ఉదయం ఎర్నాకులం కు బయలు దేరుతారు. ఎర్నాకులం రైల్వే స్టేషన్‌లో 11.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ 

* 6వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి 

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. కంఫర్ట్‌ (3ఏ) కేటగిరీ లో  సింగిల్‌ షేరింగ్‌. రూ. 32,830..  ట్విన్‌ షేరింగ్‌ ..రూ. 19,070..  ట్రిపుల్ షేరింగ్‌ రూ. 15,590 గా నిర్ణయించారు. స్టాండర్డ్‌ క్లాస్‌ కొస్తే సింగిల్ షేరింగ్‌. రూ. 30,130, ట్విన్‌ షేరింగ్‌ రూ. 16,370, ట్రిపుల్ షేరింగ్‌ రూ. 12,880 గా ఫిక్స్ చేశారు.  సికింద్రాబాద్ తోపాటు గుంటూరు, నల్గొండ, తెనాలి రైల్వేస్టేషన్ల నుంచి ఆయా పట్టణాల ప్రయాణీకులు ఈ టూర్ లో పాల్గొనవచ్చు. ప్యాకేజీ తీసుకునే ముందు ఎక్కే station … దిగే station వివరాలు ఇవ్వాలి. మరిన్ని వివరాల కోసం  irctctourism.com  ని  చూడండి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!