ఆ పాట వెనుక కథ అదేనా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………

జగపతి వారి ‘ఆత్మబలం’ సిన్మాలో ‘తెల్లవారనీకూ ఈ రేయిని పాట’ వెనకాల ఓ కథ ఉంది. 
ఆ సందర్భానికి మంచి పాట రాద్దాం అని వాయిదా వేస్తూ వచ్చాను. జగపతి రాజేంద్ర ప్రసాద్ దీ నాది భార్యా భర్తల సంబంధం. ఓ రోజు సాయంత్రం ఆయన మా ఇంటికి వచ్చి…తెల్లారే సరికల్లా పాట ఇవ్వకపోతే అని వార్నింగ్ ఇచ్చారు.

‘సరే’ అని కూర్చున్నా… రాత్రి గడచిపోతోంది… అంబ పలకడం లేదు…మర్నాడు విడాకులు తప్పేట్టులేవు అనిపించింది.. ఆ భయంలో… తెల్లారకుండా ఉంటే అన్న పౌరాణిక సిన్మాల్లో పతివ్రతలకు వచ్చేలాటి ఆలోచన వచ్చింది. వాళ్లయితే… ఒక్కో సిన్మా లో సూర్య చంద్రుల్ని కట్టడి చేసేస్తారు కూడా… నేను అలా కాదు కదా అనుకోగానే… ఏం రాయాలో స్పురించింది.
అంతే…

తెల్లవారనీకూ ఈ రేయిని…అనే పల్లవితో పావుగంట లో పాట ముగించి పడుకున్నా…
‘తెల్లవారనీకు ఈ రేయిని… తీరిపోనీకు ఈ తీయనీ హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని..
తీరిపోనీకు ఈ తీయనీ హాయిని…తెల్లవారనీకు ఈ రేయిని…

చరణం 1:
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని..
ఆ కైపులో లోకాలే మరువనీ…
మనసులో మనసునై మసలనీ..
నీ మనిషినై మమతనై మురిసిపోనీ…
నీ కురులే చీకటులై కప్పివేయని..
ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోని..
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ..
తడియారని హృదిలో నను మొలకలెత్తని..
ఈ..ఈ..

మల్లెపూల తెల్లదనం మనసు నిండని
అల్లరి పడుచుదనం కొల్లబోనీ..
కొల్లగొన్న మనసే నా ఇల్లని
చల్లగా కాపురమూ ఉండిపోనీ.’..

ఆ పాట ఎప్పుడన్నా రేడియో లో వస్తుంటే … ఘంటసాల సరే కానీ …సుశీల పాడుతున్నా…
నాకు నేనే పాడుతున్నట్టు వినిపిస్తుంది..సుశీల కూడా ఆ పాటకు న్యాయం చేశారు అనుకోండి…
పతివ్రతలకు రుణపడి ఉంటాను ఎప్పటికి…
– ఆత్రేయ

PL .SEE THIS ALSO……………………………….ఇది మరో పాట వెనుక కథ 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!