‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’పై యువకుల పరుగులు!

Sharing is Caring...

Marathon …………………………………….

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great Wall of China). దాదాపు 1500 మైళ్ల పొడవు ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి గాంచింది. ఇప్పుడు ఈ చైనా గోడ పై ఇద్దరు యువకులు పరుగులు తీస్తున్నారు.

అత్యంత క్లిష్టమైన ఈ సాహస యాత్ర ఇప్పటికే మొదలైంది. ఆ ఇద్దరి పేర్లు జిమ్మీ, టామీ లిండ్సే.  ప్రస్తుతం వారు తమ సాహస యాత్ర మధ్యలో ఉన్నారు. ఎడారుల గుండా, పర్వతాల మీదుగా, ప్రమాదకరమైన శిథిలాల మధ్య నుంచి, గడ్డకట్టించే మంచు చరియల మీదుగా నిర్మితమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై ఆరు నెలల పాటు ఆ ఇద్దరు పరుగెత్తనున్నారు.

అందుకోసం వీరు విలియం లిండ్సే అనే  కోచ్ పర్య వేక్షణలో తర్ఫీదు పొందారు. ఆ కోచ్ మరెవరో కాదు.. 35 ఏళ్ల క్రితం అదే సాహస యాత్రను పూర్తి చేసిన వారి తండ్రి. బ్రిటన్ కు చెందిన విలియం ఓ చైనా మహిళను వివాహం చేసుకున్నాడు. వీరి పిల్లలే ప్రస్తుతం సాహస యాత్ర సాగిస్తున్నారు. విలియం తర్వాత  కొంతమంది మాత్రమే ఈ గోడ చుట్టూ తిరిగి వచ్చారు.

ఇక డిసెంబర్ 1987లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది.ఈ గోడ మొత్తం 21196.18 కిమీ పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన మానవ నిర్మాణం గా గుర్తింపు పొందింది.    కొన్నివందల సంవత్సరాల కాలంలో ఈ గోడను 6 వేర్వేరు చైనీస్ రాజవంశాలు నిర్మించాయి.ఈ గోడ  2,300 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. అత్యంత సుప్రసిద్ధ క్విన్ రాజ వంశం కాలం లో ఉత్తర గోడలు అనుసంధానమైనాయి.

గోడ వేర్వేరు దిశల్లో నిర్మితమైంది. మధ్యలో పర్వతాలు..  సరస్సులు ఉంటాయి. చైనాలో సాంస్కృతిక విప్లవం సమయంలో (1966-1976) గోడ నుండి ఇటుకలను  గృహాలు, రిజర్వాయర్లు, ఇతర భవనాలను నిర్మించడానికి ఉపయోగించారు.

ఎక్కువగా సందర్శించే విభాగాన్ని బాదలింగ్ అని పిలుస్తారు. ఇది బీజింగ్ సమీపంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకే సంవత్సరం లో దాదాపు 63 కోట్లమంది సందర్శించారని అంటారు.  పీక్ సీజన్‌లో రోజుకు 70,000 మంది సందర్శకులు వస్తుంటారు.

 

ఇప్పటి వరకు  చిన్నపాటి పునరుద్ధరణ తప్ప, 1644 నుండి గోడ పై ఎటువంటి పనులు జరగలేదు. ఇది ఒక వైపే కట్టిన గోడ కాదు .. సరిహద్దుగా రెండు వైపులా గోడలు కట్టి మధ్యలో మార్గాన్ని వదిలారు. గోడలకు మధ్యలో కొన్ని చోట్ల మెట్లు .. కొంత కాలిబాట .. ఎగుడు దిగుడ్లు ఉంటాయి. తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాల్లో ఇదొకటి.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!