ఆ ఇద్దరి మధ్య పొత్తు కుదిరేనా ?

Sharing is Caring...

సూపర్ స్టార్ రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు  రెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్. రజనీ తాను సీఎం గా ఉండబోనని తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కమల్  రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని అంటున్నారు. తన మనసులో మాటేమిటో కమల్ బయట పెట్టారు. అంతవరకూ  బాగుంది. కానీ అసలు రజనీ మనసులో ఏముంది అనేది తేలాలి.  రజనీ కాంత్ అభిమానులు  వేరొకరు సీఎం కావడానికి సుముఖంగా లేరు. ఇంత కస్టపడి పార్టీ పెట్టించింది  .. సీఎంగా రజనీ ని చూసేందుకే కదా అని బాహాటంగా చెబుతున్నారు. ఈ సీఎం పదవి … చర్చలు కంటే  అసలు కమల్ తో రజనీ పొత్తు పెట్టుకుంటారా ? లేదా ? అనేది ముందు తేలాల్సి ఉంది.  ఎందుకంటె రజనీ స్టైల్ వేరు .. కమల్ స్టైల్ వేరు. ఆయన భావాలు వేరు .. ఈయన భావాలు వేరు. అక్కడే ఆ రెండు పార్టీలకి తేడా వస్తుంది. 

ఇక రజనీ పై బీజేపీ నేతలు పొత్తు కోసం ఒత్తిడి చేస్తోన్నారు.  రజనీ ఇప్పటివరకు ఏమి తేల్చకపోయినా ఆయనతో ఆర్ ఎస్ ఎస్, బీజేపీ అగ్ర నేతలు టచ్ లోనే ఉన్నారు. పొత్తు లేకపోయినా సీట్ల సర్దుబాటు కైనా బీజేపీ రెడీ అంటోంది. రజనీ నే సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించడానికి కూడా బీజేపీ కి అభ్యంతరం లేదు. ఇప్పటికే అన్నాడీఎంకే తో కలసి ప్రయాణించాలని బీజేపీ డిసైడ్ చేసింది. రజనీ నేతృత్వంలో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి సీట్లు సర్దుబాటు చేసుకొని పోటీ చేయాలనేది   బీజేపీ నేతల అసలు వ్యూహం. అలాగైతేనే  ఓట్లు చీలిపోకుండా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రజనీ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశాలున్నాయి. ఒంటరిగా పోటీ చేయడం రిస్క్ అని ఆయన సలహాదారులు కూడా చెబుతున్నారని సమాచారం. ఈ పొత్తులపై రజనీ మనసులో ఏముందో ఇప్పటివరకు బయటికి రాలేదు. రజనీ నాయకత్వానికి అన్నా డీఎంకే నేతలు ఒప్పుకుంటారో ? లేదో కూడా తేలాలి. 

ఒక వేళ  రజనీ బీజేపీ తో పొత్తుకు లేదా ఫ్రంట్ ఏర్పాటుకో సిద్ధమైతే కమల్ వైఖరి మారి పోవచ్చు. కమల్ హాసన్  బీజేపీనీ బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు . ఆ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు.ఇటీవల  మదురైలో ప్రచారం చేస్తూ కమల్.. తమ పార్టీ అధికారంలోకి  వస్తే మదురైని రెండో రాజధానిగా చేస్తానని ప్రకటించారు. సగం దేశం ఆక‌లి బాధ‌తో ఉంటే, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవ‌స‌ర‌మా? అని బీజేపీ ని ప్రశ్నించారు. అంతకుముందు కూడా బీజేపీపై కమల్ విమర్శలు  చేశారు.  కమల్  వైఖరి బీజేపీ కి అసలు నచ్చదు. ఒకవేళ రజనీ ఒకే అన్నా … సీఎం అభ్యర్థిగా కమల్ ను ఎలాంటి పరిస్థితుల్లో ప్రతిపాదించదు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితుల్లో ఫ్రంట్ గా వీరంతా ఏర్పడటం సాధ్యమయ్యే పనే కాదు. ఇక ఒంటరిగా బరిలోకి దిగితే కమల్ బలం చాలదు. ఆయన ఒక్కడే  ఇతర పక్షాలను ఎదుర్కోలేడు.  అసలు రజనీయే  కమల్ తో పొత్తుకు సుముఖత చూపుతాడా అనేది సందేహమే. రజనీ బీజేపీని కాదని కమల్ తో పొత్తు కుదుర్చుకోగలరా ? అనేది ఇంకో సందేహం. ఇన్ని సందేహాల నడుమ కమల్ కోరిక నెరవేరేనా ?  ఏమో చూద్దాం.

____________  KNM

 ఇదికూడా చదవండి >>>>>>>>>>>>>>>>>>  రాజకీయాలకు గుడ్ బై ఎందుకు చెప్పారో ?


 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!