Goverdhan Gande ………….………………………………………
How many wars? Is there no end?………………………………………………..
రామాయణ విలన్ రావణుడి కాష్టం కాదు.( రామాయణ కథానాయకుడు శ్రీరాముడు ఏనాడో సంహరించిన రావణాసురుడి మృతదేహం/కాష్టం ఇంకా కాలుతూనే ఉన్నదనేది అనేక మంది భారతీయుల విశ్వాసం.)అలాగే ఇజ్రాయెల్ లో… కూడా 4 వేల ఏళ్ల క్రితం రగిల్చిన చిచ్చు ఇప్పటికీ భగ్గుమంటూనే ఉన్నది.
జెరూసలేం లోని ‘పవిత్ర’ స్థలం కోసం తలెత్తిన వివాదం …అరబ్బులు యూదుల మధ్య యుద్ధంగా మారి.. వేళాపాళ లేకుండా జనావాసాల మీద దాడులు. అన్యాయంగా అమాయక పౌరుల ప్రాణాలు గాలిలో కలిసి పోతూనే ఉన్నాయి. ఇంకా పోతూనే ఉంటాయి.దీని వెనక అమెరికా, కొన్ని యూరప్ దేశాలున్నాయన్నది ప్రపంచ దేశాలన్ని టికీ తెలుసు. దాడులను చాలా దేశాలు ఖండిస్తాయి మొక్కుబడిగా..మొసలి కన్నీటినీ కారుస్తాయి. ఐక్యరాజ్య సమితికీ తెలుసు. ఏమీ చేయలేని దాని నిస్సహాయత కూడా మనందరికీ తెలుసు.
ఏనాడో 4 వేల ఏళ్ల నాడు యెహోవా అనే ఆయన యూదు మత పెద్ద అబ్రహంకు కలలో కనిపించాడట.పాలస్తీనాను యూదులకు అప్పగిస్తున్నని ప్రకటించాడట.తన ప్రవచనాన్ని ప్రచారం చేసేందుకు యూదులను ఎంచుకున్నానని చెప్పాడట.ఇదంతా యూదుల ప్రగాడమైన విశ్వాసం. ఎన్నో ఏళ్ళు ఎదురు చూసిన యూదులు యెహోవా వాక్కును నిజం చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పాలస్తీనాకు పయనమయ్యారు.
జెరూసలేం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఈ వలసని యూదులు.. To give a land without people to a people without land. అని భావిస్తారు. నిజానికి పాలస్తీనా అరబ్బుల సొంత నివాస ప్రాంతం. దానిలో ఓ భాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. అదే నేటి ఇజ్రాయెల్.
19 వ శతాబ్దం చివరలో ప్రారంభమైన యూదుల వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. దీంతో వేల ఏళ్లుగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్న అరబ్బుల స్థితి దుర్భరంగా మారిపోయింది. అరబ్బులను అక్కడి నుంచి తరిమివేసేందుకు ఇజ్రాయెల్ గా మారిన యూదు దేశం అమెరికా,కొన్ని యూరోపియన్ దేశాల మద్దతుతో పాలస్తీనా (జనావాసాలపై)తో నిత్యం యుద్ధం చేస్తున్నది.
గత రంజాన్ రోజున ప్రారంభమై 10 రోజుల పాటు సాగి కాల్పుల విరమణ (ఇజ్రాయెల్,హమాస్) ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఇపుడు యుద్ధానికి ముందుండే శ్మశాన శాంతి పాలస్తీనా/ఇజ్రాయెల్ లో కనిపిస్తున్నది. నిజానికి యూదులకు సొంత భూమి ఎక్కడా లేదు.అదొక సంచార జాతి. చాలా దేశాల్లో స్థిరపడిన అల్ప సంఖ్యాక వర్గం. పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న జాతిగా యూదు జాతి అభివృద్ధి చెందింది.
ప్రపంచంలోనే యూదు జాతి అత్యంత బలమైన వ్యాపార వర్గం గా మారింది. చాలా మల్టీ నేషనల్ కంపెనీలు యూదుల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. వీరంతా అమెరికా,యూరప్ దేశాల్లో స్థిరపడిన కీలకమైన వర్గం. ఈ దేశాల విధాన నిర్ణయాల్లో సైతం వీరిదే కీలక పాత్ర.అందుకే ఈ దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతునిస్తున్నాయని భావించాలి.
బ్రిటిష్ వలస దేశంగా ఉన్న పాలస్తీనాకు1922 లో అసెంబ్లీ ఏర్పాటైంది.దీని లో 12 మంది ప్రతినిధులు. వీరిలో ఇద్దరు యూదు జాతి వారుండాలనేది ఇంగ్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1948 లో పాలస్తీనాను ఇంగ్లండ్ వదిలి పెట్టింది.నాటి నుంచే అరబ్బులు యూదుల మధ్య భూవివాదం ముదిరి పోయి నిత్యయుద్ధంగా పరిణమించింది.అదే నేటికీ కొనసాగు/ కాలుతున్న రావణ కాష్టం.