ఎవరీ ‘సుచీ లీక్స్’ సుచిత్ర ?

Sharing is Caring...

The name of the sensation………………………………. 

“సుచీ లీక్స్” పేరిట నాలుగేళ్ళ క్రితం కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన సుచిత్ర మంచి గాయకురాలు. డబ్బింగ్ ఆర్టిస్ట్. అప్పట్లో ఎలా జరిగిందో ఏమో గానీ సుచిత్ర పేరు మీద సినీ ప్రముఖులపై కొన్ని పోస్టులు,వీడియోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అవి సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. అప్పట్లో సుచిత్ర మానసికంగా దెబ్బతిన్నదని ఆమె కుటుంబసభ్యులు కూడా మీడియాకు చెప్పారు.

తర్వాత రోజుల్లో భర్త కార్తీక్ నుంచి సుచిత్ర విడాకులు కూడా తీసుకున్నారు.అప్పట్లోనే ఒక తమిళ న్యూస్ ఛానెల్‌తో టెలిఫోనిక్ సంభాషణలో కార్తీక్ తాను విడాకులు తీసుకుంటున్నట్లు సుచిత్ర చెప్పింది. ఈ స్కాండల్స్ వెనుక కార్తీక్ ప్రమేయం ఉందా అని అడిగినప్పుడు లేదని స్పష్టం చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ, “కార్తీక్ అద్భుతమైన వ్యక్తి. అతనికి శ్రీరాముడి సద్గుణాలు ఉన్నాయి. కొన్ని పరిష్కరించలేని సమస్యల కారణంగా విడాకులు తీసుకుంటున్నా”మని వివరించింది.

అప్పటి సంఘటనల తరువాత సుచిత్ర లండన్ వెళ్లారు. అక్కడే కుకరీ కోర్సులో చేరారు. ఇండియా కొచ్చాక తన YouTube ఛానెల్‌ ‘సుచిస్‌లైఫ్’లో పలు రకాల వంటలపై వీడియోలను అప్ లోడ్ చేయడం హాబీగా పెట్టుకుంది. మళ్ళీ రేడియో జాకీ గా చేరి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ తర్వాత ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె చెప్పింది. తన ఫస్ట్ క్రష్ గురించి అడిగినప్పుడు సుచిత్ర “దళపతి విజయ్” అని స్పోర్టివ్‌గా సమాధానం ఇచ్చింది.

2020లో నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ రియాలిటీ టెలివిజన్ షో ‘బిగ్ బాస్’ నాల్గవ సీజన్‌లో సుచిత్ర పాల్గొన్నది.28వ రోజు షోలోకి ప్రవేశించిన సుచిత్ర ను 49వ రోజున తొలగించారు. కాగా సుచిత్ర  చెన్నైలో పుట్టింది. త్రివేండ్రం ..కోయంబత్తూర్ గ్రాడ్యుయేషన్, పీజీ చేసింది.

చదువులు ముగిశాక రేడియో జాకీ గా చేస్తూ ‘హలో చెన్నై’ ప్రోగ్రాం తో బాగా పాపులర్ అయింది. తర్వాత సింగర్ గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. శ్రియ శరణ్, లక్ష్మీ రాయ్ వంటి ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది.ఆ తరుణంలోనే సుచీలీక్స్ పేరిట వీడియోలు వెల్లువెత్తాయి. అప్పట్లోనే కోయంబత్తూర్లో సుచిత్ర పై దాడి కూడా జరిగిందని అంటారు. అయితే నిజమేమిటో ఎవరికి తెలీదు. రకరకాల పుకార్లు అయితే చాలానే ఉన్నాయి.

తర్వాత సుచిత్ర కూడా సైలెంట్ అయిపొయింది. ప్లేబ్యాక్ సింగర్‌గా  తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం  భాషల్లో చాలా పాటలు పాడింది. తెలుగులో శ్రీమంతుడు, ఊపిరి ,అల్లుడు శీను, రామయ్య వస్తావయ్యా, మిర్చి తదితర చిత్రాల్లో పాటలు పాడింది. చాలామంది సంగీత దర్శకులు ఆమె ను ఎంకరేజ్ చేశారు. యు ట్యూబ్ లో ఆమె పాడిన పాటలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వినవచ్చు 

PL. READ IT ALSO ………………………… అసలేంటీ సుచీ లీక్స్‌?

——–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!