ఎవరీ గుర్మిత్‌ కౌర్‌ ? బ్రిటన్ ఆమెను ఎందుకు వెళ్లిపొమ్మంటోంది ?

Sharing is Caring...
Life is a struggle.........

ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్‌లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆన్ లైన్‌లో సైతం పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు పలుకుతున్నారు. 

ఆమె బ్రిటన్‌లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? అసలేం జరిగింది ??

78 ఏళ్ల గుర్మిత్‌ కౌర్‌ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్వచ్ఛంద సంస్థ  స్మెత్‌విక్‌లోనే ఆమె  ఉంటోంది.  బ్రిటన్‌ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్‌ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్‌లైన్‌లో సుమారు 65 వేల మంది ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం.

గుర్మిత్‌ కౌర్‌ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన  స్మెత్‌విక్‌లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది.

క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్‌లో కూడా కుటుంబం లేదని ఆ సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్‌ కౌర్‌ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు.

అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు యూకేలో కుటుంబం లేదు అలాగే పంజాబ్‌లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆమె  టచ్‌లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టవచ్చని కాబట్టి  ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్‌ కౌర్‌ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు.

“ఆమెది  చాలా మంచి వ్యక్తిత్వం ..  దయార్థహృదయం మహిళ ఇలా సడెన్‌గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్‌లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధురాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలో తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్‌ వేసి ఆమె తరఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తు‍న్న వారిలో అతను ఒకరు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!