కాశీలో వదలాల్సింది కాయో .. పండో కాదా ?

Sharing is Caring...

what we have to leave in kasi yatra ………………………..   కొందరు మాటల సందర్భంలో  కాశీలో కాకర కాయ వదిలేశాను … బెండ కాయ వదిలేసాను.  కాబట్టి అవి తినను అంటుంటారు. ఈ కబుర్లు చాలామంది వినే ఉంటారు. మన పెద్దలు కూడా కాశీ కి వెళితే…కాయో పండో వదిలేయాలి అని చెబుతుంటారు. కానీ నిజంగా కాశీ వెళితే వదల వలసింది కాయో పండో కాదు. అందులో చిన్నమర్మం ఉంది. అదేమిటో తెలుసుకుందాం. 

అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పనే లేదు.. శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. అదే విషయం ప్రచారంలోకి వచ్చింది.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెబుతున్నది ఏమిటంటే .. కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి ” కాయాపేక్ష . .ఫలాపేక్ష” ను గంగలో వదిలి, ఆ విశ్వనాధుడిని  దర్శించుకుని  ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని. ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు…అంటే…ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ), ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని…కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.అయితే కాలక్రమేణా…అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.

అంతే కానీ… కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే…మనకు వచ్చే పుణ్యం ఏమి ఉండదు.
కనుక…. శాస్త్రం నిజంగా ఎలా చెబుతున్నదో  దాన్ని అర్థం చేసుకొని… ఆ క్షేత్ర సంప్రదాయాన్ని పాటించి ఆ శివుడిని భక్తితో దర్శించుకోవాలి. సదా స్మరించుకోవాలి. అంతే కానీ  కాశీ వెళ్లి  మామిడి కాయను .. వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.

కాశీ లో గయలో కూడా పురోహితులు కాయో/పండో గంగలో భక్తుల చేత వేయించి  … సంకల్పం చెప్పించి వెయ్యి రూపాయల దక్షిణ తీసుకుంటారు. 

————– from  whatsapp msg

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!