ఈ ఉక్కుమహిళ ఏం చేస్తున్నారో తెలుసా ?

Sharing is Caring...

ఈ ఫొటోలో కనిపించే  మహిళను  గుర్తుపట్టారా ? అదేనండీ మణిపూర్ ఉక్కుమహిళ షర్మిల. అసాధారణ రీతిలో అనుకున్నది సాధించడానికి ఏకంగా 16 సంవత్సరాలు ‘దీక్ష’ చేపట్టి ఉక్కు మహిళగా ఖ్యాతిగాంచింది.  చలనం లేని ప్రభుత్వవైఖరిపట్ల  విసుగు చెంది  దీక్ష విరమించి రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగింది.అయితే ఓటర్లు ఆమెను పట్టించుకోలేదు. ప్రజల కోసం చేసిన పోరాటాన్నిఆ ప్రజలే  పూర్తిగా విస్మరించారు. పట్టుమని 100 మంది కూడా ఓట్లు వేయలేదు. ప్రజల కోసం ఆమె 16 ఏళ్ళు కష్ట పడితే  ఫలితం దారుణం. 

ఇక అసలు విషయంలో కెళ్తే ..

మణిపూర్‌లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల 2 నవంబర్ 2000 నుంచి నిరవధికంగా నిరాహార దీక్ష చేపట్టింది.  ఇంపాల్‌కు సమీపంలోని మలోమ్ వద్ద 2000లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో పదిమంది వ్యక్తులు చనిపోయారు.వారిలో మహిళలు, జాతీయ ‘సాహస’ అవార్డు అందుకున్న బాలుడు కూడా ఉన్నాడు.
ఈ ఘోరం పై ఎవరూ స్పందించని నేపధ్యం లో షర్మిల  ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని  ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగింది.ఆ మరుసటి రోజే ఆమెపై ఆత్మహత్యా యత్నం నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపర్చారు.నాటి నుంచి 16 ఏళ్ళు  ఆమె నీళ్ళు సైతం ముట్టలేదు. అప్పటి నుంచి ఆమెకు బలవంతంగా ఫ్లూయిడ్స్ రూపంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహారాన్ని అందించారు. 
కాగా ఈ దీక్షకు మీడియా కూడా తగినంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.సాంఘిక సేవా కార్యకర్త, వార్తాపత్రికలలో కాలమిస్ట్ అయిన షర్మిల అనేక అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు.నిజంగా ఈ యుగంలో కూడా అంతటి సంకల్ప సిద్ధి గల మహిళలు ఉన్నారా అనిపిస్తుంది షర్మిల ను చూస్తే. తర్వాత కాలంలో మణిపూర్ కోర్టు ఆమెను విడుదల చేయాలని ఆదేశించిండంతో షర్మిల బయటి ప్రపంచం లో కొచ్చింది.  ఆ తర్వాత షర్మిల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది . ఏకంగా మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ పై  పోటీకి దిగింది. ముఖ్యమంత్రి కావాలని షర్మిల భావించింది. కానీ దారుణంగా ఓడిపోయింది. ఆమె పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. తనకు కేవలం 90 ఓట్లే వచ్చాయి.

దాంతో ఆమెకు ఉద్యమాలపట్ల , రాజకీయాలపట్ల విరక్తి కలిగింది.సొంత రాష్ట్రం, ప్రజల పట్ల విముఖత తో పరాయి  రాష్ట్రం వెళ్ళింది.  ముందు కేరళ వెళ్లి ప్రకృతి వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత చక్కగా తన చెలికాడు కౌటింహో ను పెళ్లి చేసుకుంది.  గత ఏడాది కవల పిల్లలకు జన్మనిచ్చి ప్రశాంతంగా మొగుడితో కాపురం చేసుకుంటోంది.  ప్రస్తుతం షర్మిల భర్త తో  కొడైకెనాల్ లో ఉంటున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!