Massacre………………………………….
కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదులు చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ‘నాడీమార్గ్’ అనే గ్రామం ఉంది. 1990 దశకం ప్రారంభంలో ఈ ‘నాడీ మార్గ్’ లోని కాశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు చేశారు. మారణకాండకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో కొందరు చనిపోయారు. మరికొందరు మహిళలు అత్యాచారానికి గురయ్యారు.
ఈ ఘటనతో గ్రామంలోని చాలా మంది పండిట్లు ఇళ్లు వదిలి జమ్మూతదితర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాశ్మీర్ లో కొన్నివందల కుటుంబాలు ఈ ఘటనతో వేరే చోట్లకు వలస పోయాయి. నాడీ మార్గ్ లో మటుకు యాభై కుటుంబాలు సొంత ఊరిపై మమకారం తో అక్కడే ఉండి పోయాయి. కొన్నాళ్ళు ప్రశాంతంగానే గడచింది. ప్రభుత్వం తొమ్మిది మంది పోలీసులతో పికెట్ ఏర్పాటు చేసింది. గ్రామస్తులు ధైర్యంగా ఉన్నారు.
2003 మార్చి 23వ తేదీన ముగ్గరు పోలీసులు డ్యూటీకి హాజరుకాలేదు.ఆ రాత్రి దాదాపు 12 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి గ్రామం లోకి ప్రవేశించారు. పోలీస్ పికెట్ వద్ద పరిస్థితిని గమనించారు. డ్యూటీలో ఉన్న ఆరుగురు పోలీసులు నిద్రపోతున్నారు. వారి ఆయుధాలను స్వాధీనం చేసుకుని అందరిని బంధించారు.తర్వాత గ్రామంలోకి వెళ్లి పండిట్లను వీధుల్లోకి ఈడ్చుకొచ్చారు.అందరిని వరుసగా చెట్టుకింద నిలబెట్టి కాల్చి చంపేశారు.
ముగ్గరు పోలీసులు డ్యూటీకి హాజరుకాలేదు.ఆ రాత్రి దాదాపు 12 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి గ్రామం లోకి ప్రవేశించారు. పోలీస్ పికెట్ వద్ద పరిస్థితిని గమనించారు. డ్యూటీలో ఉన్న ఆరుగురు పోలీసులు నిద్రపోతున్నారు. వారి ఆయుధాలను స్వాధీనం చేసుకుని అందరిని బంధించారు.తర్వాత గ్రామంలోకి వెళ్లి పండిట్లను వీధుల్లోకి ఈడ్చుకొచ్చారు.
అందరిని వరుసగా చెట్టుకింద నిలబెట్టి కాల్చి చంపేశారు. ఉగ్రవాదుల మారణకాండకు బలయినవారిలో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు. నాటి ఆ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది.ఈ దారుణ హత్యాకాండ తర్వాత ప్రాణాలతో బయటపడిన కాశ్మీరీ హిందువులు .. ఇతర ప్రాంతాలవారు కూడా అక్కడి నుంచి పారిపోయారు.
ఈ మారణకాండకు ప్రధాన సూత్రధారి ‘జియా ముస్తఫా’ అని పోలీసులు గుర్తించారు. 2003 ఏప్రిల్ 10న అతగాడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను పాకిస్థాన్ ఆదేశానుసారం మారణకాండకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ హత్యాకాండ జరిగినప్పుడు ముఫ్తీ మహ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతని స్వగ్రామం నుండి ‘నాడీమార్గ్’ కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఆ ఘటన జరిగిన 18 ఏళ్ళ తర్వాత మారణ కాండకు సూత్ర ధారి ‘జియా ముస్తఫా’ పూంచ్ ఎన్కౌంటర్ లో మరణించాడని పోలీసులు ప్రకటించారు. జియా ముస్తఫా ను కొన్నాళ్ళు శ్రీనగర్ సెంట్రల్ జైల్లో ఉంచారు. తర్వాత జమ్మూలోని ‘కోట్ బాల్వాల్’ జైలుకు పంపారు.
జైల్లో కూడా ఇతగాడు తోటి ఖైదీలను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలు లేకపోలేదు. జియాను మెందహార్ పోలీసులు 10 రోజుల రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల స్థావరాల గుర్తింపు కోసం పూంచ్ ఎన్కౌంటర్ జరుగుతున్న ‘బాతా దురియా’ వద్ద ఎన్కౌంటర్ ప్రదేశానికి తీసుకెళ్లారు.
అక్కడ ఉగ్రవాదుల కాల్పుల్లో జియా మరణించాడని సైనిక వర్గాల కథనం. జియా ఎన్కౌంటర్ యాదృచ్చికమో లేక వ్యూహాత్మకమో తెలీదు. జియాకు అర్బాజ్, అబ్దుల్లా, విక్టర్ ,ఒమర్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. జియా నాడీ మార్గ్ ఊచకోతతో పాటు, అవంతి పోరా ఎయిర్ బేస్‌పై జరిగిన దాడుల్లో కూడా పాల్గొన్నాడు.
కాగా ‘నాడీమార్గ్’ లో శిధిలావస్థలో ఉన్న అర్ధ నారీశ్వర ఆలయాన్ని పునరుద్ధరించి రెండు దశాబ్దాల తర్వాత అక్టోబర్ 2024లో తెరిచారు.ఇపుడు అక్కడ కొన్నికుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి.మృతుల కుటుంబాలకు న్యాయం జరగలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వం కూడా సరైనరీతిలో స్పందించలేదని ఆరోపణలున్నాయి.